Asianet News TeluguAsianet News Telugu

జీడీపీని 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే మోడీ ధ్యేయం: కిషన్‌రెడ్డి

2014లో మోడీ అధికారంలోకి వచ్చిన సమయంలో మన జీడీపీ 1.9 ట్రిలియన్ డాలర్లు ఉండేదని 2018-19 నాటికి 2.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని కిషన్ రెడ్డి తెలిపారు. జీడీపీని 2024-25 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నది కేంద్రప్రభుత్వ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు. 

union minister kisan reddy praises Modi's $5 trillion GDP goal
Author
Hyderabad, First Published Sep 26, 2019, 4:45 PM IST

మేకిన్ ఇండియా కార్యక్రమానికి ఉతమిచ్చేలా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. గురువారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మూలధనం కింద బ్యాంకులకు రూ.70 వేల కోట్లు అందించామన్నారు.

సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలతో పాటు ఆటోమొబైల్ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్రమంత్రి తెలిపారు. దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచే విధంగా మోడీ ప్రభుత్వం కార్యాచరణను రూపొందించిందన్నారు.

ప్రపంచాన్ని భయపెడుతున్న ఆర్ధిక మాంద్యం భారత్‌పై ప్రభావితం చేయకుండా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

2014లో మోడీ అధికారంలోకి వచ్చిన సమయంలో మన జీడీపీ 1.9 ట్రిలియన్ డాలర్లు ఉండేదని 2018-19 నాటికి 2.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని కిషన్ రెడ్డి తెలిపారు. జీడీపీని 2024-25 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నది కేంద్రప్రభుత్వ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios