కాళేశ్వరం ప్రాజెక్టు రాంగ్ డిజైన్: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంచలనం

కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ రాంగ్ డిజైన్ అని కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆరోపించారు. మంగళవారం నాడు  ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ప్రారంభాన్ని పురస్కరించుకొని  నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. 

Union Minister Gajendra Singh Shekhawat  sensational Comments  On KCR Ove kaleshwaram

హైదరాబాద్: Kaleshwaram ప్రాజెక్ట్ రాంగ్ డిజైన్ అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఏ డిజైన్ తో కట్టారుని ఆయన ప్రశ్నించారు. 
ఇంజినీరింగ్ లోపంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపు హౌస్లు మునిగాయన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్  కట్టారన్నారు. అవినీతి పరులను జైల్లో వేసేందుకే బీజేపీ కి అధికారం ఇవ్వాలని కోరారు. 

మంగళవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay మూడో విడత  Praja Sangrama Yatra పాదయాత్రను ప్రారంభించారు.ఈ పాదయాత్ర ప్రారంభాన్ని పురస్కరించుకొని నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి Gajendra Singh Shekhawat పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.  కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని ఆయన ఆరోపించా,రు. 

Telanganaలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు ఎందుకు పోరాటం చేశారో  ఆ కలలు సాకారం కాలేదన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టకు జాతీయ హోదా ఇవ్వలేదని అడుగుతున్నరని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై  కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.

డబ్బుల కోసమే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొడతామని గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. తెలంగాణలో నియంత పాలన సాగుతుందని కేంద్ర మంత్రి విమర్శించారు. తెలంగాణ;లో ప్రతి స్థాయిలో అవినీతి జరుగుతుందని గజేంద్ర సింగ్ షెకావత్ ఆరోపించారు. తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొడతామన్నారు.

ఎంతో పవిత్ర స్థలమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నoదుకు చాలా సంతోషంగా ఉందన్నారు. లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకోవడం జీవితంలోనే మరిచిపోని ఘటనగా పేర్కొన్నారు. బండి సంజయ్ రెండు విడతల పాదయాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నట్టుగా చెప్పారు..బండి సంజయ్ పాదయాత్రను ప్రజలు ఆశీర్వదించారన్నారు. 

మూడో  విడత పాదయాత్ర కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో ఇక్కడికి వచ్చానన్నారు. స్వాతంత్య్రం కోసం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఎందరో పోరాటం చేసి, ప్రాణ త్యాగం చేశారని ఆయన గుర్తు చేశారు. 

తెలంగాణ ఉద్యమంలో కూడా అలానే పోరాటం చేసి ప్రాణ త్యాగం చేస్తే. ఇప్పుడు తెలంగాణ ఎలా ఉందో మనం చూస్తున్నామన్నారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన వాళ్ళకి నిజమైన నివాళి ఇవ్వాలి అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిందేనన్నారు. 

తెలంగాణ ప్రజలు సుష్మాస్వరాజ్ ను "చిన్నమ్మ" అని గుండెల్లో పెట్టుకున్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు.  బండి సంజయ్ ఆధ్వర్యంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. 

also read:ఉన్న గద్దె ఊడిపోయే పరిస్థితి నీదీ, ఢిల్లీలో గద్దె గురించి మర్చిపో: కేసీఆర్ పై కిషన్ రెడ్డి

రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన రాష్ట్రపతి అభ్యర్థికి కేసీఆర్ మద్దతు ఇవ్వలేదన్నారు. అవినీతి, కుటుంబ పార్టీలకు మాత్రమే మద్దతుగా నిలిచాడని కేసీఆర్ పై కేంద్ర మంత్రి విమర్శలు చేశారు. అణగారిన కులాలంటే కేసీఆర్ కు గిట్టదన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios