Hyderabad: హైదరాబాద్ లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో జరిగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ ఎఫ్) 54వ ఆవిర్భావ దినోత్సవ పరేడ్ కు హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్ వెలుపల జరుగుతున్న తొలి సీఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇవే కావడం గమనార్హం. 

CISF Raising Day Parade: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) తొలిసారిగా ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) వెలుపల తన రైజింగ్ డే వేడుకలను నిర్వహించనుంది. ఈ నెల 12న తెలంగాణాలోని హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (నిసా)లో జరిగే సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే పరేడ్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశ రాజధాని వెలుపల పరేడ్ నిర్వహించనున్నట్లు సీఐఎస్ఎఫ్ (నార్త్) ఏడీజీ పీయూష్ ఆనంద్ తెలిపారు. సీఐఎస్ఎఫ్ పాన్ ఇండియా ఫోర్స్ అనీ, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ దళాన్ని దగ్గరగా చూడాల‌ని ఆయ‌న కోరారు.

సీఐఎస్ఎఫ్ కు నిసా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాబట్టి ఇక్కడ రైజింగ్ డే పరేడ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పరేడ్ లో ఒక శౌర్య పతకం, 22 రాష్ట్రపతి పోలీస్ మెడల్, విశిష్ట సేవలకు గాను రాష్ట్రపతి పోలీస్ మెడల్ సహా మొత్తం 23 పతకాలను ప్రదానం చేస్తామనీ, అనంతరం సీఐఎస్ ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది అద్భుత ప్రదర్శనలు చేస్తారని తెలిపారు. 

1970లో ఏర్పాటైన సీఐఎస్ఎఫ్ లో ప్రస్తుతం 1.70 లక్షల మంది సిబ్బంది ఉన్నార‌నీ, 66 విమానాశ్రయాలు, ఓడరేవులు, అణు, అంతరిక్ష సంస్థలు, ఢిల్లీ మెట్రో, స్టీల్, పవర్ ప్లాంట్లతో సహా దేశంలోని 354 కీలక సంస్థలకు భద్రత కల్పిస్తున్నారని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, బెంగళూరు, పుణె, ఎలక్ట్రానిక్ సిటీ, బెంగళూరు, ఒడిశాలోని టాటా స్టీల్ కళింగ నగర్ సహా 11 ప్ర‌యివేటు సంస్థలకు, 111 యూనిట్లకు అగ్నిమాపక సేవలకు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తోందని పేర్కొన్నాయి. 

Scroll to load tweet…

కాాగా, సీఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన‌డంతో పాటు కేరళలో కూడా హోంమంత్రి పర్యటిస్తారనీ, అక్కడ త్రిసూర్ లో జరిగే ర్యాలీ స‌హా ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. త్రిసూర్ చేరుకున్న తర్వాత హోంమంత్రి శక్తిన్ తంపురాన్ ప్యాలెస్ ను కూడా సందర్శిస్తారు. అలాగే శ్రీ వడక్కునాథన్ ఆలయంలో పూజలు చేయనున్నారు. అనంతరం సాయంత్రం వడక్కునాథన్ ఆలయ మైదానంలో జరిగే జనశక్తి ర్యాలీలో ప్రసంగిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.