Asianet News TeluguAsianet News Telugu

ఆయనదంతా ఒక డ్రామా.. కొత్త ట్రైబ్యునల్ ఆలస్యానికి కేసీఆరే కారణం: గజేంద్ర సింగ్ షెకావత్

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు (water disputes) సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్‌ (kcr) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ (narendra singh shekhawat) స్పందించారు.  ఇద్దరు సీఎంలు ఒప్పుకున్న తర్వాతే .. బోర్డుల పరిధిని నోటిఫై చేశారని, తెలుగు రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారానికి ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. 

union jal shakti minister gajendra singh shekhawat fires on telangana cm kcr
Author
New Delhi, First Published Nov 11, 2021, 6:53 PM IST

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు (water disputes) సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్‌ (kcr) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ (narendra singh shekhawat) స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గురువారం షెకావత్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై వివరణ ఇచ్చారు.  

కేసీఆర్‌ ఇటీవల మీడియా సమావేశాల్లో నా పేరు ప్రస్తావించారని... కేసీఆర్‌ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రజలకు, దేశానికి నిజాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని.. తెలంగాణ- ఏపీ మధ్య నీటి పంపకాల కోసం కొత్త ట్రైబ్యునల్‌ కోసం సీఎం కేసీఆర్‌ అడిగారని గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటుపై కేసీఆర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారని.. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని ఆయన గుర్తుచేశారు. పిటిషన్‌ వెనక్కి తీసుకోమని అడిగానని.. రెండ్రోజుల్లో పిటిషన్‌ వెనక్కి తీసుకుంటామని కేసీఆర్‌ అన్నారని కేంద్ర మంత్రి తెలిపారు. 

Also Read:'వరి' అస్త్రం: కేంద్రంపై యుద్ధానికి కేసీఆర్ 'సై '

సుప్రీంకోర్టు (supreme court) నుంచి కేసు వెనక్కి తీసుకునేందుకు 8 నెలలు పట్టిందని.. నెల రోజుల క్రితం పిటిషన్‌ వెనక్కి తీసుకునేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిందన్నారు. అప్పటి నుంచి కేంద్రం నిర్వర్తించాల్సిన కార్యక్రమం మొదలైందని.. ఇద్దరు సీఎంలతో కలిసి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగిందని షెకావత్ పేర్కొన్నారు. చాలా కాలం నుంచి జరగాల్సిన సమావేశాన్ని చొరవ తీసుకుని ఏర్పాటు చేశానని... ఏడేళ్లు ఆలస్యం కావడానికి తాను, కేంద్రం ఎలా బాధ్యత వహిస్తామని కేంద్ర మంత్రి  ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయని... రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. 

ప్రధాని కూడా సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారని... పరిధి నోటిఫై కానంతవరకు బాధ్యత ఎలా కొనసాగిస్తారని షెకావత్ ప్రశ్నించారు. ఇద్దరు సీఎంలు ఒప్పుకున్న తర్వాతే .. బోర్డుల పరిధిని నోటిఫై చేశారని, తెలుగు రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారానికి ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. న్యాయ మంత్రిత్వశాఖ అభిప్రాయం అడిగామని.. దాని కోసం నిరీక్షిస్తున్నామని షెకావత్ చెప్పారు. అవకాశం ఉన్నంత మేర ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని.. ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న కేసీఆర్‌ ఇలా ఎలా మాట్లాడుతారని షెకావత్ ప్రశ్నించారు. కేసీఆర్‌ చేస్తున్నది అంతా ఒక డ్రామా అంటూ గజేంద్ర సింగ్ షెకావత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios