బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్చి 15న తెలంగాణ పర్యటనకు రానున్నారు. దేశవ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాల దూకుడును తగ్గించాలని బీజేపీ అధినాయకత్వం సిద్ధమైంది.

దీనిలో భాగంగా సభల ద్వారా ప్రజల్లో సీఏఏపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. సీఏఏపై వ్యతిరేకత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కేంద్రమంత్రులు పర్యటించి ప్రభుత్వ నిర్ణయంపై వివరణ ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోడీ ఆదేశించారు.

Also Read:ముందు నుయ్యి వెనుక గొయ్యి... ఇది పవన్ పరిస్థితి

దీనిలో భాగంగానే హైదరాబాద్‌లో భారీ బహిరంగసభకు అమిత్ షా ప్లాన్ చేశారు. ఇప్పటికే సీఏఏపై తెలంగాణ సీఎం కేసీఆర్ గట్టిగా విమర్శలు సంధిస్తున్నారు. అసెంబ్లీలోనూ సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపేందుకు సన్నాహలు చేస్తున్నారు.

అటు టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభ ద్వారా కేసీఆర్‌, ఒవైసీలకు చెక్ పెట్టాలని అమిత్ షా వ్యూహం రచించినట్లుగా తెలుస్తోంది. 

Also Read:బీజేపీతో వైసీపీ జత కలిస్తే జనసేన కటీఫ్: తేల్చేసిన పవన్

ఈ సభలో అమిత్ షాతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పాల్గోననున్నారు. బీజేపీతో పొత్తు తర్వాత పవన్ హాజరవుతున్న తొలి అధికారిక సభ ఇదే కానుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.