మనుషులంతా ఒక్కటే అన్న రామానుజాచార్యుని సందేశం స్పూర్తిదాయకమన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా . భగవత్ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ధి సమారోహం వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా వుందని ఆయన పేర్కొన్నారు. సనాతన ధర్మం అన్నింటికీ మూలమని అమిత్ షా స్పష్టం చేశారు. సమతామూర్తి రాబోయే తరాలవారికి స్పూర్తి మంత్రమని ఆయన అన్నారు.
మనుషులంతా ఒక్కటే అన్న రామానుజాచార్యుని సందేశం స్పూర్తిదాయకమన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ముచ్చింతల్‌లోని (muchintal) చినజీయర్ ఆశ్రమంలో జరుగుతున్న భగవత్ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ధి సమారోహం వేడుకల్లో (ramanuja sahasrabdi samaroham) అమిత్ షా (amit shah) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడికి రావడం అదృష్టంగా వుందని ఆయన పేర్కొన్నారు. సనాతన ధర్మం అన్నింటికీ మూలమని అమిత్ షా స్పష్టం చేశారు. సమతామూర్తి రాబోయే తరాలవారికి స్పూర్తి మంత్రమని ఆయన అన్నారు.
అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు బీజేపీ నేతలు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆశ్రమానికి చేరుకున్న అమిత్ షాకు చినజీయర్ స్వామి (chinna jeeyar swamy ), మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు తదితరులు ఘనస్వాగతం పలికారు. తర్వాత సమతామూర్తి కేంద్రంలో వున్న 108 దివ్య తిరపతులను అమిత్ షా దర్శించకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలు 7వ రోజు కార్యక్రమాలు
- దుష్టగ్రహ బాధానివారణకై శ్రీ నారసింహ ఇష్టి
- జ్ఞానాజ్ఞానకృత సర్వవిధ పాప నివారణకు శ్రీమన్నారాయణ ఇష్టి
- లక్ష్మీనారాయణ మహాక్రతువు, చతుర్వేద పారాయణం
ప్రవచన మండపం:
- శ్రీనారసింహ అష్టోత్తర శతనామావళి పూజ
- సామూహిక ఆదిత్య పారాయణం
- ప్రముఖులచే ఆధ్యాత్మిక ప్రవచనాలు
- దేశ, విదేశాల నుంచి విచ్చేసిన కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు
ఇక, రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలకు హాజరయ్యేందుకు ఫిబ్రవరి 9న ఆరెస్సెస్ చీఫ్ మోహన్‌భగవత్, 10న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, 11న కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ, 12న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, 13న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముచ్చింతల్‌కు రానున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు వేడుకల్లో పాల్గొన్నారు
