27న తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటన: రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి

Hyderabad: బీజేపీ అగ్ర‌నాయ‌కుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల‌లో తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ జీ కిష‌న్ రెడ్డి.. అమిత్ షా ప‌ర్య‌ట‌న గురించి వివ‌రిస్తూ భద్రాచలంలో శ్రీరామచంద్రుని దర్శించుకుంటార‌నీ, అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించే 'రైతు గోస  భాజపా భరోసా' బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని వెల్లడించారు.
 

Union Home Minister Amit Shah's visit to Telangana on August 27: State BJP chief Kishan Reddy RMA

Union Home Minister Amit Shah's visit to Telangana: బీజేపీ అగ్ర‌నాయ‌కుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల‌లో తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ జీ కిష‌న్ రెడ్డి అమిత్ షా ప‌ర్య‌ట‌న గురించి వివ‌రిస్తూ.. భద్రాచలంలో శ్రీరామచంద్రుని దర్శించుకుంటార‌నీ, అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించే 'రైతు గోస  భాజపా భరోసా' బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని వెల్లడించారు.

వివ‌రాల్లోకెళ్తే.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈనెల 27న తెలంగాణలో పర్యటిస్తారని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి తెలిపారు. దేశ‌రాజ‌ధాని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో భద్రాచలం వస్తారని తెలిపారు. భద్రాచలంలో శ్రీరామచంద్రుని దర్శించుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించే 'రైతు గోస భాజపా భరోసా' బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని వెల్లడించారు.

మ‌రోసారి కిష‌న్ రెడ్డి తెలంగాణ ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ధాన్యం కొనుగోలులో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని కిషన్‌రెడ్డి విమర్శించారు. సమగ్రమైన పంటల బీమా పథకం తెలంగాణలో అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పి భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్నారు. ఎన్నికల ముందు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రుణమాఫీ పేరుతో మరోసారి మోసం చేస్తున్నారని విమర్శించారు.

వ్యవసాయ పనిముట్ల సబ్సిడీలను కేసీఆర్‌ సర్కారు ఇవ్వడం లేదన్నారు. సకల సమస్యలకు రైతు బంధు పరిష్కారం కాదన్నారు. లక్షలాది కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తీవ్రంగా నష్టపోయారన్నారు. మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌ కుటుంబానికి లేదన్నారు. తొలి మంత్రివర్గంలో మహిళా మంత్రి లేకుండా ఐదేళ్లు పాలించిన కేసీఆర్‌కు కేంద్రాన్ని విమర్శించే అర్హత లేదన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios