Asianet News TeluguAsianet News Telugu

Telangana Assembly Election 2023 : ‘‘సకల జనుల సౌభాగ్య తెలంగాణ ’’ పేరుతో బీజేపీ మేనిఫెస్టో.. ముఖ్యాంశాలివే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘‘సకల జనుల సౌభాగ్య తెలంగాణ’’ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. 

union home minister amit shah released bjp manifesto for telangana assembly election 2023 ksp
Author
First Published Nov 18, 2023, 7:11 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘‘సకల జనుల సౌభాగ్య తెలంగాణ’’ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలను చూస్తే.. 

బీజేపీ మేనిఫెస్టోలోని పది ముఖ్యాంశాలు :

1. ప్రజలందరికీ సుపరిపాలన - సమర్ధవంతమైన పాలన
2. వెనుకబడిన వర్గాల సాధికారత - అందరికీ చట్టం సమానంగా వర్తింపు
3. కూడు - గూడు : ఆహార, నివాస భద్రత
4. రైతే రాజు - అన్నదాతలకు అందలం
5. నారీ శక్తి  - మహిళల నేతృత్వంలో అభివృద్ధి
6.  యువశక్తి  - ఉపాధి (యూపీఎస్సీ తరహాలో గ్రూప్ 1, 2 పరీక్షల నిర్వహణ)
7. విద్యాశ్రీ  - నాణ్యమైన విద్య
8. వైద్యశ్రీ  - నాణ్యమైన వైద్య సంరక్షణ
9. సంపూర్ణ వికాసం  - పరిశ్రమలు, మౌలిక వసతులు
10. వారసత్వం  - సంస్కృతి, చరిత్ర

 

  • బీసీని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటన
  • మండల కేంద్రాల్లో నోడల్ స్కూల్స్ ఏర్పాటు
  • అన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల విధానంపై పర్యవేక్షణ
  • అర్హత కలిగిన కుటుంబాలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏడాదికి రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం
  • జిల్లా స్థాయిల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు ప్రోత్సాహం
  • మహిళలకు పది లక్షల ఉద్యోగాల కల్పన
  • ఈడబ్ల్యూఎస్ కోటా సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను 6 నెలల్లో భర్తీ చేస్తాం
  • అధికారికంగా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలు
  • విత్తనాల కొనుగోలుకు రూ.2,500 ఇన్‌పుట్ అసిస్టెన్స్
  • ధరణి స్థానంలో ‘‘మీ భూమి’’
  • పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గింపు
  • బీఆర్ఎస్ కుంభకోణాలపై విచారణకు కమిటీ
  • గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక నోడల్ విభాగం
  • ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెల ఒకటో తారీఖునే వేతనాలు, పింఛన్లు
  • మత రిజర్వేషన్లు తొలగింపు.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెంపు
  • ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా కమిటీ
  • అర్హత గల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు
  • పీఎం ఫసల్‌బీమా యోజన కింద రైతులకు ఉచిత పంటల బీమా
  • వరికి రూ.3,100 మద్ధతు ధర
  • పసుపు రైతుల కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ 
  • ఉచితంగా దేశీ ఆవుల పంపిణీ
  • టర్మరిక్ సిటీగా నిజామాబాద్
  • జాతీయ స్థాయిలో సమ్మక్క సారమ్మ జాతర
  • కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సమీక్ష
  • సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను రీయంబర్స్‌మెంట్
  • వృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ యాత్ర
  • ఆడబిడ్డ భరోసా కింద 21 ఏళ్లు వచ్చేనాటికి రూ.2 లక్షలు అందజేత
  • అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు
  • స్వయం సహాయక బృందాలకు 1 శాతం వడ్డీతోనే రుణాలు
  • ఎస్సీ వర్గీకరణకు సహకారం
  • నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ
  • పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు


 


 

Follow Us:
Download App:
  • android
  • ios