హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో విజయమే లక్ష్యంగా బిజెపి ముమ్మర ప్రచారాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వమే కాదు జాతీయ స్థాయి నాయకులు, కేంద్ర మంత్రులు కూడా రంగంలోకి దిగారు. రేపు(ఆదివారం) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో  బిజెపి గెలుపుకోసం ప్రచారం నిర్వహించనున్నారు. ఆయన హైదరాబాద్ పర్యటన పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనంతో ప్రారంభంకానుంది. 

అమిత్ షా హైదరాబాద్ పర్యటన షెడ్యూల్(29.11.2020 ఆదివారం): 

అమిత్ షా నవంబర్ 29 ఉదయం 8.30గంటలకి న్యూడిల్లీ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.30గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. 

10.45గంటలకుకి విమానాశ్రయం నుండి రోడ్డుమార్గంలో బయలుదేరి 11.30గంటలకు పాతబస్తీలో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. 11.30-11.45గంటల వరకు అమ్మవారిని దర్శించుకుంటారు. 

11.45గంటలకు భాగ్యలక్ష్మి ఆలయం నుండి బయలుదేరి 12.15-13.30గంటల వరకు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని(సనత్ నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్) డివిజన్లలో పర్యటించనున్నారు. 

13.30 గంటలకు రోడ్ షోను ముగించుకుని 14.00గంటలకు నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. 14.00-15.00గంటల వరకు లంచ్ బ్రేక్ తీసుకుంటారు. 

15.00-16.00 బిజెపి కార్యాలయంలోనే మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత 18.00గంటలకు బిజెపి కార్యాలయం నుండి బయలుదేరి 19.00గంటలకు విమానాశ్రయానికి చేరుకుని అక్కడినుండి మళ్లీ ప్రత్యేక విమానంలో డిల్లీకి బయదేరనున్నారు.