Asianet News TeluguAsianet News Telugu

Amit Shah: 'బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్‌ ఇచ్చే సమయం ఆసన్నమైంది' 

Amit Shah: తెలంగాణలోని అధికార బీఆర్‌ఎస్‌ కు వీఆర్‌ఎస్‌ ఇచ్చే సమయం వచ్చిందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా  పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ  అధికార బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు

Union Home Minister Amit Shah at the Sakala Janula Vijaya Sankalpa Sabha meeting in Nalgonda KRJ
Author
First Published Nov 19, 2023, 6:10 AM IST

Amit Shah: తెలంగాణలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరోపించారు. తెలంగాణ భవిష్యత్తు ఈ ఎన్నికల్లో నిర్ణయింబడుతుందనీ, అవినీతి బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్‌ ఇచ్చే సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ.. అధికార బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చిందన్నారు. 

జోగులాంబ ఆలయ ఆలయ అభివృద్ధికి ప్రధాని మోదీ రూ. 70 కోట్లు అందిస్తే.. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే.. తాము బీసీ వ్యక్తిని సీఎంని చేసి తీరుతామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ కంటే బీజేపీ నే బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.  

గుర్రంగడ్డ, గట్టు రిజర్వాయర్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు కేంద్ర మంత్రి అమిత్ షా. అలాగే.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇంకా ఎందుకు పూర్తి కాలేదని నిలదీశారు. గద్వాలలో 300 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామన్న ప్రజలు నమ్మించి మోసం చేశారనీ, ఆ హామీని ఎందుకు నేరవేర్చలేదని ప్రశ్నించారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే  తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. గద్వాలలో చేనేత కార్మికుల కోసం హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ పార్కు ఏర్పాటు చేస్తామనీ, పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తామని ప్రజలను మోసం చేశారని సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి అమిత్ షా మండిపడ్డారు..

కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలోనే ఉందని అమిత్ షా కీలక వ్యాఖ్యాలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌, మజ్లిస్‌ లను 2జీ,3జీ,4జీ పార్టీలని ఎద్దేవా చేశారు. ఈ పార్టీలన్నీ పోవాలని అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీతో యువత జీవితాలతో ఆడుకుందని,  బీజేపీకి అధికారమిస్తే ఐదేళ్లలో 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు కేంద్రమంత్రి అమిత్ షా. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వల్లే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కేటీఆర్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా కేసీఆర్‌ పనిచేస్తున్నారని మండిపడ్డారు. నవంబర్ 30న జరగబోయే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయించబడుతుందని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios