మిషన్ భగీరథపై కాంగ్రెస్ ఫిర్యాదు: దర్యాప్తునకు ఆదేశించిన కేంద్రం
మిషన్ భగీరథపై కేంద్రం దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ కు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
న్యూఢిల్లీ: Mission Bhagirathaపై అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారిని నియమించింది. Telangana రాస్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖలో పిర్యాదు అందింది.ఈ ఫిర్యాదుపై కేంద్రం దర్యాప్తునకు ఆదేశించింది.
మిషన్ భగీరథపై తెలంగాణ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.కేంద్ర ప్రభుత్వానికి ఫిిర్యాదు చేసింది.ఇదే విషయమై బీజేపీ కూడా విమర్శలు చేసింది. కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడుతుందని పిర్యాదు చేశారు. కేసీఆర్ అవినీతినిబయటకు తీస్తామని బీజేపీ నేతలు గతంలో పలుమార్లు చెప్పారు. BJP నేతలు KCR అవినీతిని బయట పెడతారని చెప్ంపారు కానీ ఆచరణలో మాత్రం ఏం చేశారని కాంగ్రెస్ ప్రశ్నించింది. అయితే మిషన్ భగీరథ పథకంలో అవినీతి చోటు చేసుకొందని అందిన ఫిర్యాదుల మేరకు కేంద్ర ప్రభుత్వం విచారణకు అధికారిని నియమించడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2016 ఆగష్టు 7న మిషన్ భగీరథ కార్యక్రమాన్ని గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కోమటిబండలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లా (కుళాయి) ద్వారా Driniking Water అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం. రాష్ట్రంలోని కృష్ణా,గోదావరి నదులతో పాటు ఇతర జలాశయాల నుండి నీటిని శుద్ది చేసి ప్రతి ఇంటికి నీటిని అందించడమే లక్ష్యం.1.30 లక్షల కిలోమీటర్ల పైపులైన్ ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పైప్ లైన్ల ద్వారా రాష్ట్రంలోని 24 వేల గ్రామాలు,65 పట్టణాల్లో ప్రతి ఇంటికి మంచినీటిని అందించనున్నారు.
ప్రతి ఇంటికి మంచినీటిని అందించకుంటే 2018లో ఓట్లు అడగనని కేసీఆర్ ప్రకటించారు. అయితే చాలా గ్రామాలకు మిషన్ భగీరథ పథకం కింద నీళ్లు అందకున్నా కేసీఆర్ ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని విపక్షాలు అప్పట్లో కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.మరో వైపు మిషన్ భగీరథ పథకంపై కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిందని కూడా విపక్షాలు విమర్శలు చేశాయి. మిషన్ కాకతీయపై కూడా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
మిషన్ భగీరథ పథకాన్ని దేశంలోని పలురాష్ట్రాల ప్రతినిధులు వచ్చి ప్రశంసలు గుప్పించారు. ఇంటింటికి మంచినీటి సరఫరా తీరును కూడా ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం పంపిన అధికారుల బృందం కూడా మిషన్ భగీరథ పథకాన్ని రాష్ట్రంలో పర్యటించి ప్రశంసించారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. అంతేకాదు ఈ పథకాలకు నిధులను మంజూరు చేయాాలని కూడా సూచించింది. అయితే కేంద్రం మాత్రం నిధులను మంజూరు చేయలేదని రటీఆర్ఎస్ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఈ పథకాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. ఈ ప్రాజెక్టుకు కాకపోయినా రాష్టరంలో ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా ఇవ్వకుండా కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని కూడా విమర్శలు చేస్తున్నారు.
పథకం మంచిదే అయినప్పటికీ ఈ పథకం అమల్లో అవినీతి జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం నియమించిన దర్యాప్తు అధికారి ఈ విషయమై ఏం తేలుస్తారోననేది ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠగా మారింది.