హైద్రాబాద్‌లో రూ. 26 వేల కోట్లతో ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు: కిషన్ రెడ్డి

హైద్రాబాద్ ట్రిపుల్  ఆర్ రోడ్డును ఆనుకొని  ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును చేపట్టాలని  కేంద్రం నిర్ణయించిందని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు

Union Government  Decides to  Construct  Outer  Ring Rail Project  in Hyderabad says  Kishan Reddy  lns

న్యూఢిల్లీ: హైద్రాబాద్ ట్రిపుల్ ఆర్ రోడ్డును ఆనుకొని ఔటర్ రింగ్ రైలు  ప్రాజెక్టును  చేపట్టాలని కేంద్రం నిర్ణయించిందని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు.బుధవారంనాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.  రూ. 26 వేల కోట్ల ఖర్చుతో  ఈ ప్రాజెక్టును  నిర్వహించనున్నట్టుగా మంత్రి  తెలిపారు. ఈ ప్రాజెక్టు వివరాలన్నీ  రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్టుగా  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.  

ఈ రైలు మార్గం ఎలా ఉండాలనే దానిపై  99 శాతం  ఆమోదం లభించిందని  మంత్రి తెలిపారు.  ఈ రైలు మార్గం కోసం  భూసేకరణకు  అయ్యే ఖర్చులో  50 శాతం  కేంద్రమే భరించనుందని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు.భూసేకరణకు  రాష్ట్ర ప్రభుత్వం  రూ. 500  కోట్లు కేటాయించిందని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా  మంత్రి కిషన్ రెడ్డి  తెలిపారు.ట్రిపుల్ ఆర్ రోడ్డు  తెలంగాణలోని  పలు జిల్లాలను కలుపుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.  350 కి.మీ పలు జిల్లాలను  కలుపుతూ  ట్రిపుల్ ఆర్ రోడ్డు  నిర్మాణం జరుగుతుందని  కేంద్ర మంత్రి వివరించారు.

రింగ్ రైలు  ప్రాజెక్టు దేశంలోనే తొలిసారిగా  ఏర్పాటుకానుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  అభిప్రాయపడ్డారు. ట్రిపుల్ ఆర్ రోడ్డు, రింగ్ రైలు  ప్రాజెక్టు నిర్మాణం పూర్తైతే  హైద్రాబాద్ రూపు రేఖలు మారనున్నాయని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు  సర్వే త్వరలో  ప్రారంభం కానుందని  కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి  తెలిపారు.320 కి.మీ. రీజినల్ రింగ్ రోడ్డు  కేంద్రం  నిర్మించనుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రైలు కనెక్టివిటీ లేని ప్రాంతాలకు  ఔటర్ రైలు ద్వారా మేలు జరుగుతుందని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు.ఓఆర్ఆర్ రింగ్  రైలు  సర్వే కోసం రూ. 14 కోట్లు కేటాయించినట్టుగా  కిషన్ రెడ్డి తెలిపారు. హసన్ పర్తి-కరీంనగర్ రైల్వేలైన్  కోసం సర్వే నిర్వహించనున్నట్టుగా  కేంద్ర మంత్రి వివరించారు.

ఎంఎంటీఎస్ రెండో విడత పొడిగింపులో భాగంగా  యాదాద్రి వరకు  ఈ రైల్వే లైన్ ను పొడిగించాలని  ప్రతిపాదించినట్టుగా  కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి  చెప్పారు. ఈ విషయమై  రాష్ట్ర ప్రభుత్వం  ముందుకు రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వమే  ఈ ప్రాజెక్టు  పనులను  ప్రారంభించనుందని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు. ఘట్ కేసర్-రాయగిరి మధ్య  ఎంఎంటీఎస్ మధ్య  రెండో విడతను పొడిగించనున్నట్టుగా  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  వివరించారు. ఎంఎంటీఎస్ రెండో విడతకు  కేంద్రం రూ. 330 కోట్లు కేటాయించిందని  కేంద్ర మంత్రి తెలిపారు. ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ కు  రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని  కిషన్ రెడ్డి  విమర్శించారు. తెలంగాణలో ఎన్‌సీడీసీని ఏర్పాటు  చేసేందుకు  కేంద్రం ముందుకు వచ్చిందని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios