మహబూబాబాద్ జిల్లాలో మిస్టరీగా మారిన మామిడితోట మృతదేహం కేసు

unidentified dead body found in  mahabubabad district
Highlights

మొదట ''జబర్ధస్త్''లో అవకాశం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తిదిగా...ఆ తర్వాత అతను కాదు..

మహబూబాబాద్ జిల్లాలో ఓ మృతదేహం కేసు మిస్టరీగా మారింది. కేసముద్రం మండలం కొత్తూరు లోని ఓ మామిడితోటలో అర్థనగ్నంగా లభించిన మృతదేహం ఎవరిదో పోలీసులు గుర్తించలేక పోతున్నారు. 

అయితే మొదట ఈ మృతదేహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిదిగా పోలీసులు అసుమానించారు.  టీవి కామెడీ షో జబర్ధస్త్ లో అవకాశం కోసం ఇళ్లు విడిచి వెళ్లాడని కూడా కుటుంబసభ్యులు తెలిపారు. ఇంతటితో ఈ మృతదేహం కేసు వీడిందని పోలీసులు భావిస్తుండగా మరో అడ్డంకి వచ్చిపడింది. సదరు జబర్ధస్త్ లో అవకాశం కోసం వెళ్ళిర తమ వాడు ముంబైలో ఉన్నట్లు పోలీసులకు కుటుంబ సభ్యులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో మళ్లీ ఈ మృతదేహం కేసు మిస్టరీగా మారింది.

ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కేసముద్రం మండలం కొత్తూరు సమీపంలో మామిడితోటలో అర్థనగ్నంగా పడివున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ మృతదేహం పడిఉన్న ప్రదేశానికి సమీపంలో రక్తంతో కూడిన దుస్తులు పోలీసులకు లభ్యమయ్యాయి. అందులో ఓ సూసైడ్ నోట్ ఉంది. దీంతో వాటిని ఈ మృతుడి బట్టలుగా భావించిన పోలీసులు ఆ సూసైడ్ నోట్ ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

అయితే కొన్ని రోజుల క్రితం జబర్ధస్త్ లో నటించాలని చెప్పి ఇంట్లోంచి వెళ్లిపోయాడని మొదట చెప్పారు. ఆ తర్వాత మళ్లీ పోలీసులకు ఫోన్ చేసి తమ వాడు ముంబైలో ఉన్నట్లు ఫోన్ చేశాడని తెలిపారు. దీంతో ఈ కేసు చిక్కుముడి వీడినట్లే వీడి మరింత జటిలమైంది.

మృతుడి ఆచూకీ లభిస్తే ఈ కేసు విచారణ తవరగా పూర్తవుతుందని పోలీసులు తెలిపారు. అందువల్లే ముందుగా ఆ కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మృతదేహాన్ని మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చారు.  

loader