Asianet News TeluguAsianet News Telugu

భూగర్భ గ్యాస్ పైప్ లైన్ లీక్.. మంటలు చేలరేగడంతో ఆందోళనకు గురైన స్థానికులు,.. కొంపల్లిలో ఘటన (వీడియో)

హైదరాబాద్ నగర శివారులోని కొంపల్లిలో అగ్నిప్రమాదం సంభవించింది. భూగర్భ గ్యాస్ పైప్ లైన్ కు లీకేజీ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఇందులో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. 
 

Underground gas pipe line leak.. Locals worried as fire broke out, incident in Kompally (Video)..ISR
Author
First Published Nov 6, 2023, 3:50 PM IST | Last Updated Nov 6, 2023, 3:52 PM IST

భూగర్భ గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడంతో హైదరాబాద్ కొంపల్లిలోని సుచిత్ర జంక్షన్ సమీపంలో మంటల చెలరేగాయి. ఉదయం 11.30 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్క సారిగా మంటలు చేలరేగడంతో అక్కడున్న ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై సమాచారం అందగానే అగ్నిమాపక యంత్రాలు, డీఆర్ఎఫ్ బృందాలు, భారత్ గ్యాస్ అక్కడికి చేరుకున్నాయి. 

సుమారు 12.30 గంటల ప్రాంతంలో మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. కాగా.. హైవే అభివృద్ధి పనుల కారణంగా పైపు పగిలిపోవడంతో మంటలు చెలరేగాయని, ఎవరో సిగరెట్ వెలిగించి విసిరేయడంతో మంటలు వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios