Asianet News TeluguAsianet News Telugu

వీడి ప్రేమ తగలెయ్యా.. తన ప్రపోజల్ ఒప్పుకోలేదని.. డ్రగ్స్ ప్యాకెట్ గిఫ్ట్ గా ఇచ్చి...అరెస్ట్..

ప్రేమను నిరాకరించిన యువతిపై కక్ష సాధించాలని ఆమెకు బహుమతి గా marijuana packet ఇచ్చి చివరకు కటకటాలపాలయ్యాడు  ఓ యువకుడు.  సికింద్రాబాద్ జిఆర్పి వర్గాల కథనం ప్రకారం విశాఖపట్టణానికి చెందిన వినయ్ కుమార్ 25 ప్రైవేట్ కంపెనీలో డేటా ఎంట్రీ ఉద్యోగం చేస్తున్నాడు.

man gifted a ganja packet to women over not accepting his love, arrested after 3 years
Author
Hyderabad, First Published Oct 22, 2021, 8:02 AM IST

రెజిమెంటల్ బజార్ :  ఇదో విచిత్ర ప్రేమ.. కక్షసాధింపు ప్రేమ. తనకు దక్కలేదు కాబట్టి బాధలు పడాలని కావాలని హింసించే సైకో ప్రేమ. తన ప్రేమ కాదన్నదని ఏకంగా గంజాయి కేసులో ఇరికించి జీవితకాలం వేధించాలని మాస్టర్ ప్లాన్ వేసిన ప్రేమికుడి కథ. వివరాల్లోకి వెడితే.. 

ప్రేమను నిరాకరించిన యువతిపై కక్ష సాధించాలని ఆమెకు బహుమతి గా marijuana packet ఇచ్చి చివరకు కటకటాలపాలయ్యాడు  ఓ యువకుడు.  సికింద్రాబాద్ జిఆర్పి వర్గాల కథనం ప్రకారం విశాఖపట్టణానికి చెందిన వినయ్ కుమార్ 25 ప్రైవేట్ కంపెనీలో డేటా ఎంట్రీ ఉద్యోగం చేస్తున్నాడు.

తనతో పాటు చదువుకున్న అదే ప్రాంతానికి చెందిన యువతికి ప్రేమిస్తున్నానని చెప్పగా ఆమె నిరాకరించింది. దీంతో revenge తీర్చుకోవాలని  కుట్ర పన్నాడు. ఈవెంట్స్ నిర్వాహకురాలు అయిన ఆమె ఆ పనిపై 2018 మే 31న మరో ఇద్దరు friendsతో కలిసి శిర్డీసాయి ఎక్స్ ప్రెస్ లో సికింద్రాబాద్ కు బయలుదేరింది.

ఇది అతనికి తెలిసింది. ఆమెను కలవడానికి వచ్చాడు. friendshipకి గుర్తుగా గిఫ్ట్ అని నమ్మించి మూడు కిలోల గంజాయి ప్యాకెట్ చేతికి ఇచ్చాడు.  మరుసటి రోజు రైలు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకునే ముందే..  ఆ యువతి Cannabis smuggling చేస్తున్నట్లు జిఆర్పి వారికి సమాచారం అందించాడు.  రైలు స్టేషన్ కు రాగానే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

గంజాయి సాగు చేస్తే రైతు బంధు, రైతు బీమా కట్: కేసీఆర్ సంచలన నిర్ణయం

స్నేహితుడినంటూ... గిఫ్ట్ ప్యాకెట్ రూపంలో గంజాయి ఇచ్చి ఆమెను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణకు వచ్చారు.  ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాలతో ఆ యువతిని వదిలిపెట్టారు.

అదే రోజు వినయ్ కుమార్ పై పోలీసులు case నమోదు చేశారు.  పోలీసులకు చిక్కకుండా అప్పటినుంచి అతడు తప్పించుకుని తిరుగుతున్నాడు. కేసు ఏమీ లేదని కేవలం మాట్లాడడం కోసమే  కలవాలని అధికారులు పిలిపించగా,  గురువారం స్టేషన్కు వచ్చాడు. విచారణలో గంజాయిని గిఫ్ట్ ప్యాకెట్ రూపంలో ఇచ్చింది తానేనని అంగీకరించాడు. దీంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 

గంజాయిపై కన్నెర్ర...
కాగా, గంజాయి సాగుపై కన్నెర్ర చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. గంజాయి సాగు చేస్తే rythu bandhu scheme, రైతు బీమా రద్దు చేస్తామని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఆర్‌వో‌ఎఫ్‌ఆర్‌లో సాగు చేస్తే పట్టాలు రద్దు అని సీఎం హెచ్చరించారు. త్వరలోనే డ్రగ్స్ నియంత్రణపై మరో సమావేశం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు. 

తెలంగాణలో ఒక్క గంజాయి మొక్క కూడా కనిపించకూడదని.. పాఠశాల పుస్తకాల్లో డ్రగ్స్ ప్రమాదంపై సిలబస్ పెట్టాలని కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి లభ్యత పెరిగిందని.. నిర్లక్ష్యం చేస్తే చేయిదాటే ప్రమాదం వుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. 

drugs, గంజాయి నిర్మూలన కోసం బుధవారం నాడు ప్రగతిభవన్ లో ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. Ganja అక్రమసాగు వినియోగంపై ఉక్కు పాదం మోపాలని ఆయన సూచించారు.

తెలిసీ తెలియక యువత బారినపడుతున్నారు.డ్రగ్స్ వినియోగం వల్ల మానసిక పరిస్థితి దెబ్బతింటుందని చెప్పారు.ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.గంజాయిపై డీజీ స్థాయి అధికారి నియమిస్తామని Kcrప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios