హైదరాబాద్: చదువుకోవాలనే తపన షాద్ నగర్ కు చెందిన డిగ్రీ విద్యార్ధిని ఐశ్వర్యలో బలంగా ఉంది. కానీ కుటుంబ ఆర్ధిక పరిస్థితులు మాత్రం అందుకు సహకరించడం లేదు. సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్ కావాలని కుటుంబసభ్యులను వారం రోజుల క్రితం కోరింది. లాక్ డౌన్ నేపథ్యంలో క్లాసులకు హాజరుకావడానికి ల్యాప్ టాప్ అడిగింది.

ఆమెకు ల్యాప్ టాప్ కొనుగోలు చేయించేందుకు ఆ కుటుంబం నానా తంటాలు పడింది. కుటుంబ సభ్యుల బాధను అర్ధం చేసుకొన్న ఐశ్వర్య ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకొంది.

ఐశ్వర్య తండ్రి మోటార్ సైకిల్ మెకానిక్. ఆమెకు ల్యాప్ టాప్ కొనుగోలు చేసేందుకు డబ్బులు సమకూరుస్తానని చెప్పాడు. ఐశ్వర్య 12వ తరగతిలో 98.5 శాతం మార్కులను సాధించింది. తన కూతురు లాంటి పరిస్థితి మరొకరికి రాకూడదని మృతురాలి తల్లి తెలిపింది.

డిగ్రీలో మ్యాథ్స్ రెండో సంవత్సరం చదువుతుంది ఐశ్వర్య. లాక్ డౌన్ నేపథ్యంలో కాలేజీ హాస్టల్ మూసివేయడంతో ఈ ఏడాది అక్టోబర్  లో ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. మొబైల్ లో క్లాసులు వినడం ఇబ్బందిగా మారడంతో ల్యాప్ టాప్ కావాలని తండ్రిని కోరింది. ల్యాప్ టాప్ కోసం వెయిట్ చేయాలని కోరింది.

ఈ విషయమై తాను ఎప్పుడూ కూడ అడగనని చెప్పింది. తన వల్ల తన కుటుంబానికి ఖర్చులున్నాయన్నారు. తన వల్ల కుటుంబానికి భారం కాకూడదని భావించిందన్నారు.

తమ కుటుంబ ఆర్ధిక పరిస్థితి కారణంగా తన చదువును కొనసాగించడం ఇబ్బందిగా మారిందని భావించింది. ల్యాప్ టాప్ కోసం లోన్ కోసం ప్రయత్నిస్తున్నామని కుటుంబసభ్యులు చెప్పారు. 

ఐశ్వర్యకు ఈ ఏడాది మార్చిలో 1.2 లక్షల స్కాలర్ షిప్ రావాల్సి ఉంది. కానీ ఉపకార వేతనం రాకుండా ఆలస్యమైంది.సివిల్స్ పరీక్షలు రాయాలని ఆమె భావించింది. కానీ కుటుంబ ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆమె భయపడింది.

డిగ్రీలో ప్రవేశం కోసం ఐశ్వర్య ఇంటిని తాకట్టుపెట్టారు. లాక్‌డౌన్ తర్వాత ఆమె తండ్రి వ్యాపారం కొనసాగలేదు.ఐశ్వర్య చదువుకోవడం కోసం ఆమె చెల్లెలు స్కూల్ స్థాయిలోనే చదువును మానేసింది.స్కాలర్ షిప్ చెల్లింపు ఆలస్యం కావడంతో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తెలుపుతోందని ఎస్ఎఫ్ఐ విమర్శించింది.

also read:షాద్‌నగర్ స్టూడెంట్ ఐశ్వర్య సూసైడ్: రాహుల్ గాంధీ స్పందన

స్కాలర్ షిప్ ఆలస్యం కావడంతో కష్టపడి చదవే విద్యార్ధుల పట్ల కేంద్రం ఉదాసీనత సూచిస్తోందని ఎస్ఎఫ్ఐ ఓ ప్రకటనలో విమర్శలు గుప్పించింది.

మొబైల్ ఫోన్ పనిచేయకపోవడంతో ల్యాప్ టాప్ లేనందున ఆమె ప్రాక్టికల్ పేపర్లు రాయలేదని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది.కాలేజీ హాస్టల్ ఖాళీ చేయాలని తీసుకొన్న నిర్ణయం కూడ ఐశ్వర్యకు ఇబ్బందిగా మారిందని ఎల్ఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అభిప్రాయపడ్డారు.

హఠాత్తుగా హాస్టల్ ను ఖాళీ చేయడానికి అయ్యే ఖర్చులను భరించడానికి అవసరమైన నిధులను కలిగి ఉండాలని కాలేజీ మేనేజ్ మెంట్ ఎలా ఆశిస్తోందని ఐశ్వర్య సహచర విద్యార్ధి లక్ష్మి చెప్పారు.

ఐశ్వర్య ఏనాడూ కూడ తమను సహాయం అడగలేదని ఎల్ఎస్ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ సుమన్ శర్మ చెప్పారు. తమ కాలేజీ అధ్యాపకులను, హాస్టల్ అధికారులను లేదా కౌన్సిలర్ ను ఎలాంటి సహాయం కోసం కోరలేదన్నారు.

ఈ కాలేజీకి వ్యతిరేకంగా మాట్లాడే శక్తులకు స్వార్ధ ప్రయోజనాలు ఉన్నాయని ప్రిన్సిపాల్ ఆరోపించారు.దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలను మూసివేసే సమయంలో ఎల్ఎస్ఆర్ హాస్టల్ మూసివేశారు.