Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ సర్కారుకు నిరుద్యోగులు సంధించిన 25 ప్రశ్నలివే

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రశ్నలు

25 ప్రజలకు జవాబు చెప్పేవారున్నారా? అని సవాల్

 

Un employees challenges to telangana government

కేసీఆర్ సర్కారు దాదాపు మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. మరి ఈ మూడేళ్లలో ఏం సాధించింది. సాధించిన సంగతి ఏమైనా కానీ.. సాధించాల్సినవి మాత్రం ఎన్నో ఉన్నాయంటున్నారు తెలంగాణవాదులు.. వారి ప్రశ్నల జాబితా ఇలా ఉంది. మరి కేసీఆర్ టీమ్ వీటికి సమాధానం చెప్పగలదా..!? అని నిరుద్యోగులు అడుగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం, టిఆర్ఎస్ పార్టీలోని ఏ ప్రముఖులైనా వీటికి వివరణ ఇవ్వగలరా అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ప్రశ్నల జాబితా ఇది.

1). మియాపూర్ భూముల దొంగలు దొరికిర్రా?

2). ఇసుక మాఫియా నడుపుతున్న సర్కారు పెద్దలెవరు?

3).నయీం అక్రమాల కేసు ఏమైంది?

4). డ్రగ్ కేసులో ఉన్న సర్కారు మనుషులు ఎవరు?

5). డ్రగ్స్ కేసు కథ కంచికేనా?

6).గురుకుల టీచర్ల రిక్రూట్‌మెంటు ఎటు పోయింది?

7).దళితులకు మూడు ఎకరాల భూమి ఏమైంది?

8).ఇండ్లు లేని ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చినట్లేనా?

9).స్కైవేలు నిర్మాణాల జాడేది?

10). హైకోర్టు తెలంగాణాకు తెచ్చారా?

11).ఉద్యమం అప్పుడు నీతో ఉన్న ఉద్యమ నాయకులు ఇప్పుడు ఏరి?

12).ప్రభుత్వ మెడికల్ కాలేజీలెన్ని వచ్చాయి ?

13).TSPSC చేసిన నియామాకాలెన్ని?

14).మంత్రి వర్గంలో మహిళలేరి?

15).పార్టీ మారిన దళితుడే ఉప ముఖ్యమంత్రి పదవికి అర్హుడా?

16). తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కంటే ఎంఐఎం, బిజెపి లు తియ్యగా కొట్టినయా?

17).మీరు చేస్తే ఉద్యమం అదే మరొకరు చేస్తే ద్రోహామా?

18).సింగరేణీ వారసత్వ ఉద్యోగాల విషయంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వంపై కుట్రనా?

19).మతపరమైన రిజర్వేషన్స్ రాజ్యాంగ విరుద్ధం అంటే అది కుట్ర అంటావా?

20).ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఇబ్బడి ముబ్బడి పెంచితే రాష్ట్రం అబివృద్ధి చెందినట్లా?

21).12% ముస్లిం లకు అన్నటువంటి రిజర్వేషన్లు అయ్యే పనేనా?

22). KG To PG విద్య ఎంత వరకు వచ్చింది?

23). EAMCET లీకేజీ కేసు ఏమైంది?

24). మూసీనది మురికి వదిలిందా? హుస్సేన్ సాగర్ ప్రక్షాళన జరిగిందా?

25). కరీంనగర్ పట్టణం లండన్,పారీస్ లాగా మారిపోయిందా?

ఇట్లు.... 

కడుపు మండిన తెలంగాణా నిరుద్యోగులు.

Follow Us:
Download App:
  • android
  • ios