యూఏఈ విజిట్ వీసా నిబంధనలు కఠినతరం.. విజిట్ పై వెళ్లాక వర్క్ వీసా ఇస్తామంటే జాగ్రత!

యూఏఈ విజిట్ వీసా నిబంధనలు కఠినతరం చేసింది. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉంటే వారిని నిషేధ జాబితాలో చేరుస్తామని ఆ ప్రభుత్వం తెలిపింది. తద్వార వారు ఇతర గల్ఫ్ దేశాలకూ వెల్లలేకపోతారు.
 

UAE makes more strict rules for visit visa kms

హైదరాబాద్: గల్ఫ్ దేశాలకు భారతీయులకు సంబంధాలు ఎక్కువ. ఈ దేశాలకు ఎక్కువగా వలస కార్మికులుగా వెళ్లుతుంటారు. అలాగే, ఈ దేశాలు పర్యాటకానికీ ప్రసిద్ధి చెందినవే. కాబట్టి, గల్ఫ్ గురించి మాట్లాడేవారు ఎక్కువగా విజిట్ వీసా గురించి లేదా వర్క్ వీసా గురించి మాట్లాడుతుంటారు. కొందరు ఏజెంట్లు అడ్డదారిలో డబ్బు సంపాదించాలని అమాయక కార్మికులను మోసం చేస్తుంటారు. విజిట్ వీసా మీద అక్కడకు పంపి తర్వాత వారికి అందుబాటులో లేకుండా పోతారు. వీసా గడువు తీరిన తర్వాత అక్కడ అనధికారికంగా దినదిన గండంగా బతుకుతారు. ఇలా అనధికారికంగా ఆ దేశంలో ఉండే వాళ్ల సంఖ్య తగ్గించుకోవాలని యూఏఈ విజిట్ వీసా నిబంధనలు కఠినతరం చేసింది.

సాధారణంగా యూఏఈ 30 రోజులు, 60 రోజుల గడువుతో విజిట్ వీసాలను జారీ చేస్తూ ఉంటుంది. ఈ వీసా గడువు ముగిసేలోగా మళ్లీ స్వదేశానికి తిరిగి వచ్చేయాలి. కానీ, విజిట్ వీసా మీద వెళ్లినప్పటికీ కొందరు అక్కడ పని చేయడానికే స్థిరపడతారు. గడువు మీరిన ఆ దేశం వీడకుండా అనధికారికంగా ఉండే వారిపై చర్యలు తీసుకుంటారని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. వీసా గడువు తీరినా అక్కడే ఉంటే వారిని నిషేధిత జాబితాలో చేరుస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిషేధం పడితే.. వారు ఇతర గల్ఫ్ దేశాల్లో ప్రవేశానికి అనర్హులవుతారు.

Also Read: యూపీలో 183 మంది నేరస్తుల ఎన్‌కౌంటర్ హత్యలను దర్యాప్తు చేయాలి: సుప్రీంకోర్టులో పిటిషన్

అందుకే యూఏఈలో పని చూపిస్తామని, విజిట్ వీసాపై వచ్చినా.. ఆ తర్వాత దాన్ని వర్క్ వీసాగా మారుస్తామని ఏజెంట్లు మాయమాటలు చెబితే నిరుద్యోగులు నమ్మరాదని గల్ఫ్ వలస కార్మిక సంఘాల ప్రతినిధులు జాగ్రత్తలు చెబుతున్నారు. ఒక్కసారి నిషేధం పడితే గల్ఫ్ ఆశలు వదిలిపెట్టుకోవాల్సే ఉంటుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios