ఆల్వాల్ లోనూ ఓ కిట్టుగాడున్నాడు జాగ్రత్త...!

two young boys kidnapped pet dog in hyderabad
Highlights

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి వాటి యజమానుల వద్ద డబ్బుల వసూలు చేసే కథతో రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన కిట్టుగాడున్నాడు జాగ్రత్త! సినిమా మీకు గుర్తుందా. అందులో హీరో తన స్పేహితులతో కలిసి డబ్బున్నవారి కుక్కలను కిడ్నాప్ చేస్తుంటాడు. దీన్నే హీరోయిజంగా భావించారో ఏమోగాని హైదరాబాద్ ఆల్వాల్ లో ఇద్దరు యువకులు ఇలాగే పెంపుడు కుక్కను కిడ్నాప్ చేసి కటకటాలపాయలయ్యారు.
 
ఈ విచిత్రమైన కిడ్నాప్ కు సంబంధించిన వివారాలిలా ఉన్నాయి.  మచ్చ బొల్లారం ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం తమ ఇంట్లో ఓ ఖరీదైన శునకాన్ని పెంచుకుంటున్నారు. అయితే ఈ హైబ్రీడ్ జాతి కుక్కపై అదే ప్రాంతంలో నివాసముండే పవన్,శరత్ అనే ఇద్దరు యువకులు కన్నేశారు. పక్కాగా ప్లాన్ చేసి ఆ కుక్కను కిడ్నాఫ్ చేశారు. దాన్ని వేరేవారికి అమ్ముకుని డబ్బులు సంపాదించాలని నిందితులిద్దరూ భావించారు.

అయితే ఎంతో ఇష్టంగా, అల్లారుముద్దుగా పెంచేకుంటున్న కున్న కనిపించకపోవడంతో యజమానురాలు అంబిక కంగారుపడి పోయింది. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసి కెమెరాల సాయంతో నిందితులను గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు, వారి నుండి స్వాధీనం చేసుకున్న పెంపుడు కుక్కను యజమానురాలికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
 
loader