సింగరేణి గనిలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి కేటీకే 6వ గనిలో బుధవారం ప్రమాదం సంభవించింది

సింగరేణి గనిలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి కేటీకే 6వ గనిలో బుధవారం ప్రమాదం సంభవించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

గనిలో రూప్ కూలి ఇద్దరు సింగరేణి కార్మికులపై పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్నిఅందుకున్న అధికారులు.. హుటాహుటిన అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు.

మృతులను క్యాతం నరసయ్య, తలవెని శంకరయ్యగా గుర్తించారు. 3 టీమ్ 11,11 జేషన్‌లో ఈ ప్రమాదం జరగగా.. ఘటనా స్థలం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇక, ఈ ఘటనతో కార్మికుల కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.