హైదరాబాద్‌లో దారుణం జరిగింది. పాతబస్తీలోని మైలార్‌దేవ్‌పల్లి రోషన్‌కాలనీలో అత్తాకోడళ్లను దారుణంగా హత్య చేశారు. వేట కోడవళ్లతో ఇద్దరిని నరికిన దుండగులు అనంతరం ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేశారు. 

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. పాతబస్తీలోని మైలార్‌దేవ్‌పల్లి రోషన్‌కాలనీలో అత్తాకోడళ్లను దారుణంగా హత్య చేశారు. వేట కోడవళ్లతో ఇద్దరిని నరికిన దుండగులు అనంతరం ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేశారు.

భర్త రాత్రి విధులకు వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. దోపిడి దొంగల కోణంలో విచారణ జరుపుతున్నారు. ముందుగా భర్తపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అతనిని విచారించి వదిలేశారు.

ఇది దొంగల పనా... లేదంటే దీని వెనుక మరేదైనా కోణం వుందా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ నుంచి ఈ కుటుంబం వలస వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.