Asianet News TeluguAsianet News Telugu

అతివేగం : టూ వీలర్ ట్యాంక్ పగిలి ఇద్దరు యువకులు సజీవ దహనం..

దత్తు వాహనం నడుపుతుండగా, వాసుదేవ్ వెనక కూర్చున్నాడు.  bodmatpally వద్దకు రాగానే  వాహనం అదుపు తప్పి రోడ్డు మధ్యలో  డివైడర్ కోసం తవ్విన గుంతలో పడ్డారు. ఈ తాకిడికి బండి పెట్రోల్ ట్యాంకు పగిలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బండిమీదున్న ఇద్దరికీ మంటలు అంటుకున్నాయి.

Two wheeler tank burst and two young men burned alive in medak
Author
Hyderabad, First Published Dec 31, 2021, 12:38 PM IST

మెదక్ :  అరగంటలో తిరిగి వస్తామని ఇంట్లో చెప్పి జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంపై వచ్చిన యువకులు అతివేగం కారణంగా జరిగిన ప్రమాదంలో వాహనంతో సహా సజీవదహనమయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధి  bodmatpally శివారులో 161వ  నెంబరు జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి జరిగింది.

టేక్మాల్ పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా  నాగల్ గిద్ద మండలం ఎస్గి గ్రామానికి చెందిన  వాసుదేవ్ (22), నారాయణఖేడ్ మండలం  మంగళంపేట గ్రామంలో  స్థిరపడ్డాడు. అదే గ్రామానికి చెందిన దత్తు (23) వాసుదేవ్ లు మంచి స్నేహితులు. బుధవారం రాత్రి వారిద్దరూ నారాయణఖేడ్ కి వెళ్లి అక్కడ తెలిసిన వారి అవెంజర్ ద్విచక్రవాహనాన్ని తీసుకుని సంగారెడ్డికి వస్తున్నారు.

 టేక్మాల్ మండలం  bodmatpally సమీపంలో 161వ  నెంబరు జాతీయ రహదారిపై  అతివేగం రాంగ్ రూట్లో వచ్చారు.  దత్తు వాహనం నడుపుతుండగా, వాసుదేవ్ వెనక కూర్చున్నాడు.  bodmatpally వద్దకు రాగానే  వాహనం అదుపు తప్పి రోడ్డు మధ్యలో  డివైడర్ కోసం తవ్విన గుంతలో పడ్డారు. ఈ తాకిడికి బండి పెట్రోల్ ట్యాంకు పగిలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బండిమీదున్న ఇద్దరికీ మంటలు అంటుకున్నాయి.

వారు బాధతో అరుపులు, కేకలు వేశారు.  ఆ మార్గంలో వెళుతున్న వారు అది చూసి.. వారిని కాపాడే ప్రయత్నంలో భాగంగా 100కి ఫోన్ చేశారు. వెంటనే టేక్మాల్ పోలీసులు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికి దత్తు పూర్తిగా కాలిపోయాడు. సగానికిపైగా మంటలు అంటుకున్న వాసుదేవ్ ని ఆస్పత్రికి తరలించేందుకు  ప్రయత్నించే లోపు  ప్రాణాలు వదిలాడు. 

వాసుదేవ్ ఓకేబుల్ ఆపరేటర్ వద్ద  కార్మికుడిగా,  దత్తు గ్యాస్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నారు. వాసుదేవ్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

హైద్రాబాద్‌లో అదృశ్యమైన ఇద్దరు మైనర్ బాలికలు: పోలీసుల గాలింపు

ఇదిలా ఉండగా, ఫుల్లుగా మద్యం తాగి కనీసం కారు డోర్ కూడా తీసుకోలేనంత మత్తులోకి వెళ్లిపోయి.. చావును కొని తెచ్చుకున్నాడో మందుబాబు. కారు డోర్స్, విండోస్ అన్నీ పూర్తిగా మూసివుండటంతో ఊపిరాడక కారులోనే అపస్మారక స్థితిలోకి వెళ్ళి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... సికింద్రాబాద్ సమీపంలోని బోయిగూడ ప్రాంతంలో ప్రశాంత్(38) భార్యా పిల్లలతో కలిసి నివాసముండేవాడు. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే కొంతకాలంగా మద్యానికి బానిసైన ప్రశాంత్ ప్రతిరోజూ తాగి ఇంటికివచ్చేవాడు. 

గత మంగళవారం రాత్రికూడా ఇంటికి సమీపంలోనే ప్రశాంత్ ఒక్కడే మద్యం సేవించాడు. తన కారులోనే డోర్స్, విండోస్ క్లోజ్ చేసుకుని ఫుల్లుగా తాగాడు. దీంతో ఆ మత్తులో కనీసం కారు డోర్లు కూడా ఓపెన్ చేసుకోలేకపోయాడు. ఇలా కారులోనే చాలాసేపు వుండటంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. 

భర్త ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన భార్య వెళ్లిచూడగా అప్పటికే ప్రశాంత్ అపస్మారక స్థితిలో కారులో పడివున్నాడు. దీంతో ఆమె ప్రశాంత్ సోదరుడికి సమాచారమివ్వగా మరో తాళం తీసుకుని వచ్చి కారు డోర్స్ ఓపెన్ చేసారు. తీవ్ర అస్వస్థతతో కారులో పడివున్న ప్రశాంత్ ను వెంటనే దగ్గర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.  అయితే అతడి పరిస్థితి విషమంగా వుండటంతో దగ్గర్లోని గాంధీ హాస్పిటల్ కు తరలించాలని డాక్టర్లు సూచించారు. దీంతో కుటుంబసభ్యులు గాంధీకి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రశాంత్ మృతిచెందాడు. ఇలా తాగుడుకు బానిసై చివరకు ప్రాణాలు కోల్పోయాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios