హైద్రాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ లోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమయ్యారు. స్కూల్ కు వెళ్లిన విద్యార్ధిని ఇంటికి తిరిగి రాలేదు. టైలరింగ్ నేర్చుకొనేందుకు వెళ్లిన మరో విద్యార్ధిని కూడా ఇంటికి రాలేదని పోలీసులకు విద్యార్ధినుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: hyderabad అత్తాపూర్‌లో ఇద్దరు విద్యార్ధినులు అదృశ్యమయ్యారు. ఉదయం ఇంటి నుండి వెళ్లిన Girl Studenets సాయంత్రం వరకు తిరిగి రాలేదు. దీంతో ఇద్దరు విద్యార్ధినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టైలరింగ్ నేర్చుకోవడానికి ఇంటి నుండి వెళ్లిన విద్యార్దిని సాయంత్రం వరకు తిరిగి రాలేదు. Attapur లోని మరో ప్రాంతంలో స్కూల్ కు వెళ్లిన మరో విద్యార్ధిని కూడా సాయంత్రం వరకు ఇంటికి రాలేదు.
దీంతో విద్యార్ధినుల పేరేంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విద్యార్ధినుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్ధినులు ఏ ఏ ప్రాంతాల్లో ప్రయాణం చేశారనే విషయమై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్ధినులు ప్రయాణించిన ప్రాంతాల్లోని సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. విద్యార్ధినులు కన్పించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తప్పిపోయిన బాలికల ఆచూకీని కనిపెట్టేందుకు రాజేంద్రనగర్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
