Asianet News TeluguAsianet News Telugu

దర్భంగాలో పేలింది.. హైదరాబాద్ బాంబే??

దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు దాడులు జరిగినా మూలాలు హైదరాబాదులో ఉంటాయని అపవాదు ఒకప్పుడు భాగ్యనగరానికి ఉండేది. దాదాపు దశాబ్దకాలంగా ఆ మచ్చ తొలగి పోయింది.. అనుకుంటున్న తరుణంలో తాజాగా..  బీహార్లోని దర్భంగా రైల్వే స్టేషన్ లో  చోటు చేసుకున్న పేలుడు మూలాలు హైదరాబాదులో బయటపడ్డాయి.

Two suspected IM operatives detained in Hyderabad - bsb
Author
Hyderabad, First Published Jun 29, 2021, 9:33 AM IST

దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు దాడులు జరిగినా మూలాలు హైదరాబాదులో ఉంటాయని అపవాదు ఒకప్పుడు భాగ్యనగరానికి ఉండేది. దాదాపు దశాబ్దకాలంగా ఆ మచ్చ తొలగి పోయింది.. అనుకుంటున్న తరుణంలో తాజాగా..  బీహార్లోని దర్భంగా రైల్వే స్టేషన్ లో  చోటు చేసుకున్న పేలుడు మూలాలు హైదరాబాదులో బయటపడ్డాయి.

ఈ నెల 17న దర్భంగా రైల్వే స్టేషన్ లోని ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ వద్ద సికింద్రాబాద్ నుంచి వచ్చిన రైలు నుంచి ఓ వస్త్రాల వ్యాపారి పార్సిల్ దింపుతుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు అవ్వకున్నా, ఆస్తి, ప్రాణ నష్టం లేకున్నా ఉగ్రవాద కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు ప్రారంభించింది.

ఆ పార్సిల్ దర్భంగా కు చెందిన మహమ్మద్ రఫీ అనే వ్యక్తికి చేరాల్సి ఉన్నట్లు గుర్తించింది.  ఈ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ కు చెందిన తండ్రీకొడుకులు మహమ్మద్  సలీం ఖాసీం,  మహమ్మద్ కఫీల్‌ను అరెస్టు చేసింది. వీరిద్దరికీ పాకిస్తాన్ నుంచి నిధులు బదిలీ అయినట్లు తేలింది.

పాకిస్తాన్ కు చెందిన ఇక్బాల్ ఖాన్ అనే వ్యక్తి వీరికి డబ్బు పంపినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఇక్బాల్‌  ద్వారా వీరిద్దరికీ హైదరాబాద్లో ఉంటున్న ఇమ్రాన్, నాసిర్‌ పరిచయం అయినట్లు నిర్ధారించింది. అదే సమయంలో పేలుళ్లకు కారణమైన వస్త్రాల పార్శిల్‌ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చినట్లు గుర్తించింది,  దీంతో బీహార్ ఏటీఎస్ అధికారులు ఓ బృందాన్ని సికింద్రాబాద్ కు పంపారు

వారు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అధికారులతో కలిసి పలు ఆధారాలను సేకరించారు. ఈ నెల 15న కారులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  కు వచ్చిన ఇద్దరు యువకులు రైల్వే కౌంటర్ వద్ద వస్త్రాల పార్శిల్‌ను అందజేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. వారిద్దరిని సోమవారం అరెస్టు చేశారు.

వారిని ఇమ్రాన్‌, నాసిర్‌ అని, వారు ఇద్దరు అన్నదమ్ములు అని గుర్తించారు. ప్రస్తుతం వారిద్దరూ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్లో బీహార్ ఏటీఎస్‌ నిర్బంధంలో ఉన్నారు.  వారిని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇద్దరు సోదరుడు ఎవరు...అంటే.. ఆసిఫ్ నగర్ లో ఉంటున్న ఇమ్రాన్‌, నాసిర్‌ స్వస్థలం యూపీలోని కురిసి అని అధికారులు తెలిపారు. యూపీ నుంచి రెడీ మేడ్ గార్మెంట్స్ వ్యాపారం చేసేందుకు వారిద్దరూ హైదరాబాద్ ఆఫీస్ నగర్ కు వచ్చారు. ఆర్డర్లపై పలు ప్రాంతాలకు  గార్మెంట్స్‌ను తరలిస్తుంటారు, ఈ క్రమంలోనే ఈ పార్సీలు పంపారు.  వస్త్రాల మధ్య ఉన్న ఓ సీసాలో ఉన్న ద్రవపదార్థం కారణంగా పేలుడు సంభవించింది. యూపీలో అరెస్ట్ అయిన తండ్రి కొడుకులు కూడా వీరి పేర్లు చెప్పారు సిసిటివి ఫుటేజ్ లో కూడా ఈ ఘటన వెనక వీరి పాత్ర విస్పష్టమైందని పేర్కొన్నాయి.

 అయితే ఈ నెట్వర్క్ వెనుక నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ ఉండి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ముంబై జైలులో ఉన్న ఐఎం ఆపరేటివ్ యాసిన్భత్కల్ పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు ఉన్నాయి.

 దర్భంగా రైల్వే స్టేషన్ లో జరిగిన పేలుడుకు కారణమైన ద్రవపదార్థం ఏమిటి అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. బీహార్ ఏటిఎస్ అధికారులు పేలుడు ఘటన స్థలం నుంచి సేకరించిన నమూనాలు అక్కడి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు తరలించారు.  అయితే.. ఆ పేలుడు పదార్థం ఏంటో అక్కడ నిర్ధారణ కాలేదని సమాచారం.  దీంతో ఎన్‌ఐఏ ఆ నమూనాలను కోల్‌కతాలోని సీఎఫ్ఎస్ఎల్‌కు పంపింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios