Asianet News TeluguAsianet News Telugu

Hyderabad : అర్ధరాత్రి అమ్మాయితో లాంగ్ డ్రైవ్... యాక్సిడెంట్ లో ఇద్దరు యువకులు మృతి

హైదరాబాద్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

Two students died and three injured in road accident in Hyderabad AKP
Author
First Published Oct 8, 2023, 9:14 AM IST

హైదరాబాద్ : అర్ధరాత్రి ఫుల్లుగా మద్యం సేవించి లాంగ్ డ్రైవ్ కు వెళ్ళి ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు కొందరు కాలేజీ విద్యార్థులు. హైదరాబాద్ శివారులో గత శుక్రవారం రాత్రి ఓ కారు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న చెట్టుకు ఢీకొన్న ఘటనలో ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్ మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ శామీర్ పేటలోని విశ్వవిశ్వాని కాలేజీలో తుషార్, రూబేన్, ఫిలిప్, భవేష్, హరిప్రియ బిబిఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. నగరంలోని పలుప్రాంతాల్లో నివాసముంటున్న వీళ్లంతా గత శుక్రవారం అర్ధరాత్రి లాంగ్ డ్రైవ్ కు వెళ్ళారు. ఈ ఐదుగురు కలిసి కారులోనే మద్యం సేవిస్తూ ప్రమాదకరంగా ప్రయాణిస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు.

శుక్రవారం అర్ధరాత్రి ఐదుగురు స్నేహితులు శామీర్ పేట నుండి కీసరకు బయలుదేరారు. కొంపల్లిలో మద్యం కొనుగోలు చేసి బోగారం హోలిమేరీ కాలేజీ వరకు వెళ్ళారు. అక్కడే మందుపార్టీ చేసుకుని మరికొంత మద్యాన్ని కారులోనే తాగుతూ తిరిగి శామీర్ పేటకు బయలుదేరారు. ఈ క్రమంలోనే వారు ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళుతుండగా కీసర సమీపంలో ప్రమాదానికి గురయ్యింది. మూలమలుపు వద్ద వేగానికి కారు అదుపుకాక రోడ్డుపక్కకు దూసుకెళ్లి ఓ చెట్టును ఢీకొట్టింది. దీంతో తుషార్(18), భవేష్ రావు(17) అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. 

Read More  విషాదం.. 100కు పైగా కోతుల మృత్యువాత.. అసలేం జరిగిందంటే..?

రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన రూబెన్, ఫిలిప్, హరిప్రియను దగ్గర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అలాగే తుషార్, భవేష్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. 

మద్యంమత్తులో ప్రయాణమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. డ్రైవింగ్ చేస్తున్న ఫిలిప్ మద్యం సేవించకున్నా పక్కనున్నవారు మద్యంమత్తులో హంగామా చేయడంతో ప్రమాదం జరిగివుంటుందని భావిస్తున్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios