Asianet News TeluguAsianet News Telugu

విషాదం.. 100కు పైగా కోతుల మృత్యువాత.. అసలేం జరిగిందంటే..? 

Siddipet: సిద్దిపేట జిల్లాలోని జగదేవ్‌పూర్ మండలంలోని  మునిగడప గ్రామ శివారులో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతంలో 100కు పైగా కోతులు అనుమానాస్పదంగా మృతి చెందాయి.  
 

Over 100 monkeys found dead in Munigadapa village Siddipet KRJ
Author
First Published Oct 8, 2023, 3:01 AM IST

Siddipet: సిద్దిపేట జిల్లాలోని జగదేవ్‌పూర్ మండలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.  మునిగడప గ్రామ శివారులో శనివారం నాడు  100కు పైగా కోతులు అనుమానాస్పదంగా మృతి చెందాయి.  ఉదయం పొలాల్లోకి వెళ్లిన రైతులకు పొలాల సమీపంలో కోతుల కళేబరాలు కనిపించాయి. వారు వెంటనే వెటర్నరీ అధికారులకు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి చేరుకున్న  వెటర్నరీ అధికారులు కోతుల కళేబరాల నుంచి నమూనాలను సేకరించి, ల్యాబ్ కు పంపించారు. ఈ ఘటన గ్రామాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. పురుగుమందులు కలిపిన నీటిని కోతులు తాగి ఉంటాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.

ఈ దారుణం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితి పరిశీలించారు. అలాగే.. స్థానికుల నుంచి సమాచారాన్ని సేకరించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios