Bangles: ఒక్క కొడుకు ఉన్నవారికి ఇద్దరు కొడుకులున్నవారు గాజులు వేయాలా? పండితులు ఏమంటున్నారు?

ఇద్దరు కొడుకులు ఉన్నవారు ఒక్క కొడుకు ఉన్నవారికి గాజులు వేయించాలనే ప్రచారం జరుగుతున్నది. గ్రామాల్లో ఈ ప్రచారం ప్రబలంగా సాగుతున్నది. దీనిపై పండితులు ఏమంటున్నారో చూద్దాం.
 

two sons parents should give bangles to one son parents talk in villages, what priests saying kms

Customs: ఈ సంక్రాంతికి కీడు వచ్చిందనే ప్రచారం జోరుగా సాగింది. దీనికి విరుగుడు.. ఇద్దరు కొడుకులున్నవారు.. ఒక్క కొడుకు ఉన్నవారికి గాజులు వేయించాలనే ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు, గాజులు కాకున్నా.. కనీసం డబ్బులైనా ఇవ్వాలని అంటున్నారు. గతంలోనూ ఇలాంటి అనేక ప్రచారాలు జరిగాయి. జాకెట్ పీస్‌లు, కొబ్బరికాయలు, ఇలా పలు రకాల వస్తువులను కొనిచ్చిన ఘటనలు చూశాం. గతంలోనూ గాజులు వేయాలనే ప్రచారం జరిగింది. 

కొందరు గాజుల కోసం అడగడానికి మొహమాట పడుతుంటే.. మరికొందరు వేయించాల్సిందేనని ఇబ్బంది పెడుతున్నారు. అడిగినా వేయించలేని స్థోమత ఉన్నవారు మరింత సతమతం అవుతున్నారు. ఇంతకీ ఇది హైందవ ఆచారమా? ఈ ఆచారాన్ని తప్పకుండా అందరు పాటించాలా? ఈ ఆచారంపై పండితులు ఏమంటున్నారు?

కరీంనగర్‌కు చెందిన ప్రముఖ సిద్దాంతి నరసింహా చారి ఈ అనుమానాలపై సమాధానాలు ఇచ్చారు. గాజులు కొనివ్వాలనే ప్రచారాన్ని ఆయన కొట్టి వేశారు. ఇదంతా వట్టిదేనని, శాస్త్రవిరుద్ధం అని స్పష్టం చేశారు. హైందవ సంప్రదాయంలో ఎక్కడా ఇలా చేయాలని లేదని వివరించారు. హిందువులకు ప్రమాణం వేదాలే కదా.. కానీ, వేదాల్లో ఇలాంటి ఆచారాలేవీ లేవని స్పష్టం చేశారు. ఈ ప్రచారాలన్నీ కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా కొందరు చేస్తున్నట్టు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇలా లేని పోని విధంగా ప్రచారం చేయడం తగదని, గాజులు అంటే సాక్షాత్తు లక్ష్మీ దేవి అని, ఇలా అర్థరహిత ప్రచారంతో లక్ష్మీ దేవిని కించపరుస్తున్నారని మండిపడ్డారు. అవసరమైతే ముత్తయిదువులకు గాజులు కొనిస్తే మంచిదేనని వివరించారు. 

Also Read: Bilkis Bano Case: లొంగిపోవాలని కోర్టు ఆదేశం.. 9 మంది దోషుల పరార్

సంక్రాంతి అనేది కీడు పండుగ కాదని ఆయన తెలిపారు. అలాంటి సంక్రాంతి పండుగకు కీడు వచ్చిందని ప్రచారం చేయవద్దంటూ హితవు పలికారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios