భాగ్యనగరానికి పాకిన నిపా వైరస్ ?

First Published 25, May 2018, 4:15 PM IST
two nipah virus suspected cases hyderabad
Highlights

భాగ్యనగరంకి  పాకిన నిపా వైరస్ ?

కేరళ  వాసులను వణికిస్తున్న నిఫా వైరస్ ఇప్పుడు హైదరాబాద్ నగరానికి వ్యాపించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భాగ్యనగరంలో ఇద్దరు వ్యక్తులకు సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. వీరిలో ఒకరు కొద్దిరోజుల క్రితం కేరళ వెళ్లి వచ్చారు. వీరి రక్త నమూనాలను నిపా వైరస్ నిర్ధారణ కోసం పుణెలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించినట్టు తెలంగాణ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కే రమేష్‌ రెడ్డి కొద్దిసేపటి క్రితం వెల్లడించారు. అనుమానితుడు కేరళలో వెళ్లొచ్చిన ప్రాంతానికి, నిపా వైరస్‌ సోకిన ప్రాంతానికి వందల కిలోమీటర్ల కొద్దీ దూరం ఉందని చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.అత్యవసర సమయాల్లో స్పందించేందుకు అన్ని విధాలుగా సిద్ధం అవుతున్నట్లు పేర్కొన్నారు . 

loader