యాజమాన్యానికి తెలీకుండా గోడ దూకి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లారు. ఆనందంగా వేడుకలు చేసుకొని తిగిరి కాలేజీకి పయనమయ్యారు. ఆ కమ్రంలో... ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... విద్యార్థులు మాదాపూర్ లోని నారాయణ కాలేజీలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారు. గురువారం రాత్రి స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు ఎవరికీ చెప్పకుండా.. గోడదూకి వెళ్లిపోయారు. తీరా... సంబరాలు చేసుకొని వెనక్కి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదిలా ఉండగా... తమ కాలేజీలో 9మంది విద్యార్థులు అదృశ్యమయ్యారు అంటూ.. నారాయణ కాలేజీ యాజమానం పోలీసులకు మిస్సింగ్ కేసు పెట్టింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.