మహేష్ బ్యాంక్ (Mahesh Bank) సర్వర్ హ్యాకింగ్ కేసు ఓ కొలక్కివచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 5కి చేరింది. కూకట్‌పల్లి కేంద్రంగా ఈ మోసం జరిగిందని పోలీసులు గుర్తించారు.

మహేష్ బ్యాంక్ (Mahesh Bank) సర్వర్ హ్యాకింగ్ కేసు ఓ కొలక్కివచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 5కి చేరింది. కూకట్‌పల్లి కేంద్రంగా ఈ మోసం జరిగిందని పోలీసులు గుర్తించారు. నైజీరియన్లతో చేతులు కలిపి రూ. 12.93 కోట్ల రూపాలయను ముఠా కాజేసింది. 30 శాతం కమిషన్ కోసం ఆంధ్రప్రదేశ్, చెన్నైకి చెందిన వ్యక్తులు నైజీరియన్లకు సహకరించారు. కూకటల్‌పల్లి హౌసింగ్ బోర్డులోని ఓ మాల్ వద్ద ఈ హ్యాకింగ్ జరిగింది. నలుగురు బెనిఫిషరీ ఖాతాలను నైజీరియన్లు హ్యాక్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన లక్కీ అనే వ్యక్తి కీలకంగా వ్యహరించాడని.. అతనికి తెలుగు రాష్ట్రాల్లోని లోన్ బ్రోకర్లతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. 

రుణాల కోసం బ్రోకర్లను సంప్రదించేవారితో కొత్త ఖాతాలు తెరిపించేలా ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక, గతేడాది నవంబర్‌లోనే ఇందుకు సంబంధించిన బ్లూ ప్రింట్‌ను నైజీరియన్లు సిద్దం చేసుకున్నారు. లక్కీని కేంద్రంగా చేసుకుని నైజీరియన్లు ఈ వ్యుహాన్ని రచించారు. మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాక్ చేసేందకు జనవరి 21వ తేదీన నైజీరియన్లు హైదరాబాద్‌కు వచ్చారు. కూకట్‌పల్లిలోని ఓ హోటల్‌లో నైజీరియన్లు బస చేశారు. 22వ తేదీ రాత్రి మహేష్ బ్యాంక్ సర్వర్‌ను నైజీరియన్లు హ్యాక్ చేశారు. 

ఇక, ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్ద‌రు నైజీరియ‌న్ల‌తో పాటు ముంబైకి చెందిన షాన‌వాజ్‌ను హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురిని పంజాగుట్ట పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించి విచారించారు. అయితే ముగ్గురి ఖాతాల్లోకి న‌గ‌దు బ‌దిలీ అయిన‌ట్లు పోలీసులు గుర్తించిన సంగ‌తి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ మహేష్ బ్యాక్ కో ఆపరేటివ్‌ బ్యాంక్ ప్రధాన సర్వర్‌ను హ్యాక్‌ చేసిన సైబర్ నేరగాళ్లు రూ. 12.9 కోట్లు కొల్లగొట్టారు. ఈ కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత బ్యాంక్‌లోని మూడు అంకౌంట్లకు డబ్బులు తరలించారు నేరగాళ్లు. దానిని ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లోని 128 ఖాతాలకు బదిలీ చేశారు. ఈ క్రమంలోనే ఆ మూడు బ్యాంకకు ఖాతాల యజమానుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆ మూడు అకౌంట్‌ల విషయానికి వస్తే అవి.. శాన్విక్‌ ఎంటర్‌ప్రైజెస్‌, హిందుస్తాన్‌ ట్రేడర్స్‌, షానవాజ్‌ బేగం పేర్లతో ఉన్నాయి. ఈ ఖాతాలను వివిధ బ్రాంచ్‌లో తెరిచారు.