టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ స్కాం:కరీంనగర్ లో మరో ఇద్దరు అరెస్ట్
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ స్కాంలో సిట్ ఇవాళ మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. వరంగల్ డీఈ రమేష్ కు రూ. 5 లక్షలు ఇచ్చి పేపర్ ను కొనుగోలు చేసినట్టుగా సిట్ గుర్తించింది.
కరీంనగర్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరిని సిట్ గురువారంనాడు అరెస్ట్ చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ లో ఇద్దరు అధ్యాపకులను సిట్ అరెస్ట్ చేసింది. వరంగల్ కు చెందిన విద్యుత్ శాఖ డీఈ రమేష్ తో ఈ ఇద్దరికి లింకులున్నాయని సిట్ గుర్తించింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ లో గల ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న డీఈతో పాటు మరొకరిని సిట్ అరెస్ట్ చేసింది. వరంగల్ డీఈ రమేష్ కు రూ. 5 లక్షలు ఇచ్చి పేపర్ ను తీసుకున్నట్టుగా సిట్ గుర్తించింది.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ స్కాం ను ఈ ఏడాది మార్చి మాసంలో గుర్తించారు. మార్చి మొదటి వారంలో నిర్వహించాల్సిన రెండు పరీక్షలను టీఎస్‌పీఎస్‌సీ వాయిదా వేసింది. టీఎస్‌పీఎస్‌సీ సివిల్ అసిస్టెంట్ సర్జన్, టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ పరీక్షలను వాయిదా వేశారు. టీఎస్‌పీఎస్‌సీకి చెందిన కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని ఈ పరీక్షలను వాయిదా వేశారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ స్కాం ను దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.
also read:టీఎస్‌పీఎస్‌పీ పేపర్ లీక్ లో రూ. 1.63 కోట్ల లావాదేవీలు: చార్జీషీట్ దాఖలు చేసిన సిట్
ఈ ఏడాది జూన్ 9వ తేదీన టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో సిట్ చార్జీషీట్ దాఖలు చేసింది. మొత్తం రూ. 1.63 కోట్ల లావాదేవీలు జరిగినట్టుగా సిట్ చార్జీషీట్ లో పేర్కొంది. 49 మందిని అరెస్ట్ చేసినట్టుగా చార్జీషీట్ లో పేర్కొంది సిట్. తాజాగా అరెస్ట్ చేసిన ఇద్దరితో ఈ కేసులో అరెస్టైన ఇద్దరితో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 51కి చేరింది. పేపర్ లీక్ కారణంగా గతంలో నిర్వహించిన కొన్ని పరీక్షలను టీఎస్‌పీఎస్‌సీ రద్దు చేసింది. మరికొన్ని పరీక్షలను నిర్వహించకుండా వాయిదా వేసింది. గ్రూప్ -1 పరీక్ష పేపర్ కూడ లీకైందని గుర్తించిన తర్వాత ఇటీవలనే ఆ పరీక్షను టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించింది.