Asianet News TeluguAsianet News Telugu

టీఎస్‌పీఎస్‌పీ పేపర్ లీక్ లో రూ. 1.63 కోట్ల లావాదేవీలు: చార్జీషీట్ దాఖలు చేసిన సిట్

టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ కేసులో ఇవాళ కోర్టులో సిట్  చార్జీషీట్ దాఖలు  చేసింది.  

TSPSC  Paper leak case:  SiT Files  Charge sheet  in Court lns
Author
First Published Jun 9, 2023, 3:03 PM IST

హైదరాబాద్:  టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో   శుక్రవారంనాడు  కోర్టులో  సిట్  చార్జీషీట్ దాఖలు  చేసింది.  ప్రశ్నాపత్రాల లీక్ కేసులో  లో   రూ. 1.63 కోట్ల లావాదేవీలు జరిగినట్టుగా  గుర్తించినట్టుగా సిట్  చార్జీషీట్ లో  పేర్కొంది. 

టీఎస్‌పీఎస్ పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు  49 మందిని అరెస్ట్  చేసినట్టుగా  సిట్  తెలిపింది. ఈ కేసులో  16 మంది మధ్యవర్తులుగా వ్యవహరించారని  చార్జీషీట్ లో  సిట్  తెలిపింది.  ఈ కేసులోని నిందితుడు  ఒకరు న్యూజిలాండ్ లో ఉన్నారని  చార్జీషీట్ లో  సిట్  తెలిపింది. గ్రూప్ -1  ప్రశ్నాపత్రం నలుగురికి లీకైందని సిట్  తెలిపింది.  ఏఈఈ  పరీక్షలో ముగ్గురు అభ్యర్ధులు మాస్ కాపీయింగ్ కు పాల్పడ్డారని చార్జీషీట్ లో  సిట్ వివరించింది.  రాజశేఖర్, ప్రవీణ్, రేణుక , ఢాక్యానాయక్ లను  ప్రధాన నిందితులుగా  సిట్  పేర్కొంది. మొత్తం  37 మందిపై   టీఎస్‌పీ‌ఎస్‌సీ  పేపర్ లీక్ కేసులో  అభియోగాలు మోపింది సిట్ .

నిందితుల  నుండి సెల్ ఫోన్లు, ఇతర పరికరాలను  స్వాధీనం  చేసుకున్నామని  సిట్ ప్రకటించింది.  పేపర్ లీక్ కు ఉపయోగించిన  మొబైల్స్  ఇతర  ఎలక్ట్రానిక్  పరికరాలను  ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని  సిట్  చార్జీషీట్  లో  తెలిపింది. డీఏవో ప్రశ్నపత్రం ఎనిమిది మందికి లీకైందని  సిట్  తెలిపింది.  టీఎస్‌పీఎస్‌సీ   ప్రశ్నాపత్రాలు  కాన్పిడెన్షియల్ సెక్షన్ నుండి లీకైనట్టుగా  సిట్  చార్జీషీట్ లో  ప్రస్తావించింది. 

also read:టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు: చార్జీషీట్ దాఖలు చేయనున్న సిట్

ఈ ఏడాది  మార్చి 11న టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ పై  పోలీసులు  కేసు నమోదు  చేసి దర్యాప్తును ప్రారంభించారు.  తొలుత  టీఎస్‌పీఎస్‌సీ  కార్యాలయంలో కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని  అనుమానించారు.  కానీ  పోలీసుల విచారణలో  పేపర్లు లీకయ్యాయని తేలింది. ఈ ఏడాది మార్చి  మాసంలో  జరగాల్సిన  టౌన్ ప్లానింగ్  ఓవర్సీస్,  సివిల్ అసిస్టెంట్ల సర్జన్ల నియామకం పరీక్షలను వాయిదా వేసింది  టీఎస్‌పీఎస్‌సీ.

టీఎస్‌పీఎస్‌సీ కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని  ఈ పరీక్షలను వాయిదా వేశారు.  అయితే  మార్చి  5  వ తేదీన  జరిగిన  ఏఈఈ  పరీక్ష  పేపర్ లీకైన విషయం పోలీసుల విచారణలో  తేలింది.  దీంతో  పలు  పరీక్షలను వాయిదా వేశారు. కొన్ని పరీక్షలను రద్దు చేశారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios