భర్తతో విభేధాల కారణంగా ఒంటరిగా ఉంటున్న ఓ వివాహితను బలవంతంగా లొంగదీసుకోవాలనుకున్న యువకులు దారుణంగా వ్యవహరించారు. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఒక యువతి భర్తతో విభేదాల కారణంగా కొద్దినెలలుగా తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.

ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు యువకులు ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని కుట్ర పన్నారు. రెండు, మూడు నెలులగా ఆమెతో మాట కలిపేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరలేదు.

దీంతో ఆమె ఇంటిపక్కనే ఉంటున్న మరో మహిళ ద్వారా ఆకర్షించాలని నిర్ణయించారు.. ఆమెతో ఒక యువకుడికి బంధుత్వం ఉండటంతో తరచుగా మహిళ ఇంటికి వెళ్లేవారు. అలా మహిళతో కలిసి యువతి ఇంటికి వెళ్లేవారు..

అలాగే ఒక్కోసారి సదరు మహిళ ఆ యువతిని తన ఇంటికి తీసుకువచ్చేది. అయితే ఇద్దరు యువకులను చూడగానే ఆమె తిరిగి వెళ్లిపోయేది. ఎంతగా ప్రయత్నించినా తమ పథకం పారకపోవడంతో కొత్త పన్నాగం పన్నారు.

బాధితురాలి పక్కింటి వారు విందు ఏర్పాటు చేస్తున్నారని తెలుసుకున్న ఆ యువకుడు .. దానికి సదరు యువతిని ఆహ్వానించాలని మహిళను కోరారు. వారు చెప్పినట్లే చేసిన మహిళ...ఆ యువతిని ఇంట్లో విందుకు పిలిచింది.

అనంతరం నిందితులిద్దరూ అందరి భోజనం పూర్తయ్యాక యువతి దుస్తులపై పండ్ల రసం పోశారు. శుభ్రం చేసుకునేందుకు మహిళతో పాటు బాధితురాలిని తీసుకువెళ్లేలా చేశారు. గదిలో ఎవరూ లేకపోవడంతో ఆమె దుస్తులు విప్పి నీటితో పండ్ల రసాన్ని శుభ్రం చేసుకుంది.

అయితే మంగళవారం సాయంత్రం ఆమె సోదరుడి ఫోన్‌కి, ఆమె ఫోన్‌కి కొన్ని అభ్యంతరకరమైన ఫోటోలు వచ్చాయి. వాటిని చూసిన ఆమె అవాక్కయ్యింది.

తనకు ఏ పాపం తెలియదని సదరు యువతి.. సోదరుడికి చెప్పడంతో వారు బుధవారం రాత్రి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.