హైదరాబాద్:హైద్రాబాద్ రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం నాడు ఉదయం కారు బీభత్సం సృష్టించింది.ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్ డిపో వద్ద అతి వేగంగా ఓ కారు దూసుకు వచ్చింది. స్పీడును కంట్రోల్ చేయలేకపోవడంతో కారు డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కారు ఎవరిది, కారు నడుపుతున్నవారు ఎవరనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. మద్యం మత్తులో కారును వేగంగా నడిపారా లేక ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.