ఇద్దరు హైదరాబాద్ పోలీసులపై వేటు

two hyderabad cops suspende
Highlights

ఎందుకో తెలుసా

హైదరాబాద్ లో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ల మీద వేటు పడింది. వాళ్ల మీద సస్పెన్షన్ వేటు ఎందుకు పడిందో తెలిస్తే షాక్ అవుతారు. ఇద్దరు కానిస్టేబుళ్ళను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

అసలు విషయమేమంటే ? మద్యం సేవించి వాహనం నడిపుతూ కొందరు వ్యక్తులు పోలీసులకు దొరికిపోయారు. వారిని పరీక్షించే క్రమంలో రాహుల్, నవీన్ అనే పోలీసు కానిస్టేబుళ్ళు మద్యం సేవించిన వ్యక్తులతో దురుసుగా ప్రవర్తించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో రాహుల్, నవీన్ పై వేటు పడింది.

ఈ కానిస్టేబుళ్లు ఇద్దరు సంతోష్ నగర్, సైఫాబాద్ పోలీసు స్టేషన్లకు చెందిన వారు. మొత్తానికి తాగినోడు బాగనే ఉన్నడు కానీ.. తాగినోడి పట్ల దురుసుగా ప్రవర్తించిన కారణంగా ఇద్దరు పోలీసులపై వేటు పడడం ఆశ్చర్యకరంగా ఉందంటున్నారు జనాలు.

loader