హైదరాబాద్:యువతులతో  వ్యభిచారం చేస్తున్న  ఇద్దరు వ్యక్తులను  నేరేడ్‌మెట్ పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. నేరేడ్‌మెట్  డిఫెన్స్‌కాలనీలోని రాఘవేంద్ర రెసిడెన్షీలో నివసిస్తున్న పి. సర్కార్‌ ప్రదీప్‌ అలియాస్‌ సంజూ,తన అసిస్టెంట్‌ మాలిక్‌ మరో వ్యక్తితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు యువతులను తీసుకొచ్చి వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. 

వ్యభిచార నిర్వాహకుడు సంజూ  అమ్మాయిలను కోల్‌కతా, కొల్లాగ్‌పూర్, షోలాపూర్ ఇతర ప్రాంతాల నుండి యువతులను తీసుకొచ్చి నేరేడ్‌మెట్ సమీపంలోని నిర్మల్‌నగర్‌లోని ఓ రూమ్‌లో బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. 

ఈ విషయమై సమాచారం అందుకొన్న రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అడిషనల్ డిప్యూటీ కమిషనర్ సయ్యద్ రఫిక్ పర్యవేక్షణలో దాడి చేసి పట్టుకొన్నారు.
 కోల్‌కతాకు చెందిన యువతి, విటుడు, సంజును అదుపులోకి తీసుకున్నారు. 

సంజును విచారించగా కోల్‌కతాకు చెందిన ముగ్గురు, షోలాపూర్‌కు చెందిన ఓ యువతిని పటాన్‌చెరులోని నోబుల్‌ లాడ్జిలో ఈనెల 23 నుంచి ఉంచినట్టు చెప్పాడు. వారిని కూడా అదుపులోకి తీసుకుని మూడు సెల్‌ఫోన్లు, రూ. 7,600 స్వాధీనం చేసుకున్నారు. 

ఏడుగురిని నేరేడ్‌మెట్‌ పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇద్దరి రిమాండ్‌కు, యువతులను రెస్క్యూ హోంకు తరలించినట్టు సీఐ ఎం. జగదీశ్‌ చందర్‌ తెలిపారు.