హైద్రాబాద్  నగరంలో  నేరేడ్  మెట్  జేజేనగర్  అనాథ ఆశ్రమంలో ఇద్దరుబాలికలపై లైంగిక దాడి  జరిగింది. ఈ మేరకు మురళి  అనే వ్యక్తిని  పోలీసులు   అరెస్ట్  చేశారు.


హైదరాబాద్:నగరంలోని నేరేడ్‌మెట్ జేజేనగర్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో ఉన్న ఇద్దరు బాలికలపై లైంగిక దాడి జరిగింది. ఈ విషయమై బాలికల ఫిర్యాదుల మేరకు అనాధ ఆశ్రమంలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న మురళిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నెల 19 వ తేదీన ఈ అనాధ ఆశ్రమం నుండి నలుగురు అమ్మాయిలు పారిపోయారు. ఈ ఆశ్రమంలో మొత్తం 35 మంది విద్యార్ధినులుంటారు. అయితే నలుగురు విద్యార్ధినులు పారిపోవడంతో ఆశ్రమ నిర్వాహకులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ పిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ నిర్వహించారు. సికింద్రాబాద్ లో ఇద్దరిని ,మరో ఇద్దరిని తమబంధువుల ఇళ్లలో పోలీసులు గుర్తించారు. బాలికలను సఖి సెంటర్ కు తరలించి కౌన్సిలింగ్ నిర్వఁహించారు. అయితే తమపై లైంగిక దాడి జరిగిందని కౌన్సిలింగ్ సమయంలో ఓ బాధితురాలు తెలిపింది. దీంతో ఈ విషయమై పూర్తి వివరాలు సేకరించిన సఖి సెంటర్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా అకౌంటెంట్ మురళిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ అనాథ ఆశ్రమంలో ఉన్న 35 మందిని నింబోలి అడ్డాలోని హస్టల్ కు తరలించారు అధికారులు.హైద్రాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లో గలడీఏవీ స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారిపై రజనీకుమార్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగు చూడడం కలకలం రేపుతుంది.