చిన్నా,పెద్దా తేడా లేకుండా.. వృద్ధురాలని కూడా చూడకుండా కామాంధులు వ్యవహరించారు. 70యేళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన రెండేళ్లకు కోర్టు ఆ నిందితులకు జీవితఖైదు విధించింది.  

హైదరాబాద్ : నవజాతశిశువు నుంచి కాటికి కాలు చాపుకున్న ముసలి వారి వరకు ఆడది అయితే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. అమానుషంగా అత్యాచారాలకు తెగబడుతున్నారు. కన్నూ,మిన్నూ కానక అకృత్యాలకు పాల్పడతున్నారు. ఇలాంటి ఓ కేసులో మల్కాజిగిరి కోర్టు నిందితులకు జీవితఖైదు విధించింది.

70 ఏళ్ల వృద్ధురాలిపై rape చేసిన ఇద్దరు నిందితులకు మల్కాజ్ గిరి కోర్టు Life imprisonment విధించింది. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 2019, డిసెంబర్ 17న కల్లు దుకాణం వద్ద ఓ వృద్ధురాలితో ఇద్దరు మాటలు కలిపారు. Paintersగా పనిచేస్తున్న ఆంథోని, విజయ్ కలిసి వృద్ధురాలిని తమ గదికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి కల్లు తాగారు. ఎక్కువ మోతాదులో కల్లు సేవించిన వృద్ధురాలు మత్తులోకి జారుకుంది.

 ఆ తర్వాత ఆంథోని, విజయ్ లు వృద్ధురాలిపై అత్యాచారం చేశారు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి.. వృద్ధురాలిపై అత్యాచారం జరిగినట్లు గుర్తించి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆంథోని, విజయ్ లకు 50 ఏళ్ల వయసు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

malkajgiri courtలో విచారణ సందర్భంగా పోలీసులు ఆధారాలు సమర్పించడంతో పాటు... సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరు నిందితులను దోషులుగా తేల్చిన మల్కాజ్గిరి కోర్టు… జీవిత ఖైదుతో పాటు ఐదు వేల జరిమానా విధించింది. నిందితులకు శిక్ష పడేలా దర్యాప్తు నిర్వహించిన మల్కాజిగిరి పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను రాచకొండ సీపీ మహేష్ భగవత్ అభినందించారు. 

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 4న కూడా ఇలాంటి కేసులో ఓ నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఆపదలో ఉన్న వారిని రక్షించాల్సిన పోలీస్ అధికారి అయి ఉండి mental condition సరిగా లేని యువతిని చెరబట్టిన కామాంధుడికి court కఠిన శిక్ష విధించింది. తుమకూరు నగరం వద్ద యువతిపై ఏఎస్ఐ ఉమేశయ్య అత్యాచారం చేసినట్లు నేరం రుజువు కావడంతో అతనికి 20 సంవత్సరాల imprisonmentతో పాటు.. లక్ష రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు జడ్జి హెచ్.ఎస్.మల్లికార్జునస్వామి మంగళవారం తీర్పు వెలువరించారు.

ఒంటరి యువతిని చూసి..
2017 జనవరి 14వ తేదీన రాత్రి ఒంటరిగా ఉన్న మతిస్థిమితం లేని యువతిని ఉమేశయ్య గస్తీకి వెళ్ళినప్పుడు చూశాడు. కొంతసేపటికి కారులో వచ్చి యువతిని బెదిరించి తీసుకెళ్లి molestation చేశాడు. మరుసటి రోజు ఈ దారుణం యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఉమేశయ్యను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. 

ఉమేశయ్య నేరం చేసినట్టు కోర్టులో రుజువు కావడంతో శిక్ష తప్పలేదు. ప్రభుత్వ న్యాయవాది కవిత పకడ్బందీగా వాదనలు వినిపించారు. బాధితురాలికి దోషి లక్ష రూపాయల జరిమానా అందించాలని ఆదేశించారు. కాగా, ఉమేశయ్య జీపు డ్రైవర్ పై నేరం నిరూపణ కాకపోవడంతో అతనికి విముక్తి కల్పించారు. ఈ తీర్పుపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ తీర్పు కామాంధులకు గుణపాఠం కావాలని పేర్కొన్నాయి.