సలేశ్వరం జాతరలో విషాదం: ఊపిరాడక ఇద్దరు మృతి
నాగర్ కర్నూల్ లో సలేశ్వరం జాతరలో విషాదం చోటు చేసుకుంది. ఊపిరాడక ఇద్దరు భక్తులు మృతి చెందారు.
నాగర్ కర్నూల్: జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో గురువారంనాడు విషాదం చోటు చేసుకుంది. సలేశ్వరం జాతరకు భారీగా భక్తులు తరలిరావడంతో ఊపిరాడక ఇద్దరు భక్తులు మృతి చెందారు. నాగర్ కర్నూల్ కు చెందిన చంద్రయ్య, వనపర్తి జిల్లాకు చెందిన అభిషేక్ లు మృతి చెందారు. సలేశ్వరంలో లింగమయ్యను దర్శించుకొనేందుకు వెళ్లారు .లోయ ప్రాంతంలో పెద్ద ఎత్తున భక్తులు ఒక్కసారిగా రావడంతో ఊపిరాడక భక్తులు మృతి చెందారు.
ప్రతి ఏటా నాగర్ కర్నూల్ జిల్లాలోని సలేశ్వరం జాతరకు వారం నుండి పది రిజుల వరకు అనుమతి ఇస్తారు . అయితే ఈ ఏడాది కేవలం మూడు రోజులు మాత్రమే భక్తులకు అవకాశం కల్పించారు. అంతేకాదు షరతులతో కూడిన అనుమతిని ఫారెస్ట్ అధికారులు ఇచ్చారు. దీంతో పెద్ద ఎత్తున సలేశ్వరానికి భక్తులు వచ్చారు. నల్లమల అటవీ ప్రాంతంలో లోయ ప్రాంతంలో లింగమయ్యను దర్శించుకొనేందుకు వెళ్లిన భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. గంటల తరబడి లింగమయ్యను దర్శించుకొనేందుకు ఎదురు చూడాల్సి వచ్చింది. కొందరు భక్తరులు లింగమయ్యను దర్శిచుకోకుండానే వెనక్కి తిరిగారు. ఒక్కసారిగా లోయ ప్రాంతంలోకి భక్తులు పెద్ద ఎత్తున వెళ్లడంతో ఊపిరాడక ఇద్దరు భక్తులు మృతి చెందారు.