పండగ పూట విషాదం.. గాలిపటాలు ఎగురవేస్తూ.. కరెంట్ షాక్ కు గురైన చిన్నారులు.. 

 పండగ పూట విషాదం నెలకొంది. దాబాపైన గాలిపటాలు ఎగుర వేస్తూ ఇద్దరూ చిన్నారులు కరెంట్ షాక్ కు గురయ్యారు. దీంతో స్థానికులు చిన్నారులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో చోటుచేసుకుంది

two children electrocuted while flying kites in korutla KRJ

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండుగ. ఈ పండుగను తమ సొంతవూళ్లలో చేసుకోవాలని పట్టణాలు, నగరాల్లో ఉద్యోగాలకు వెళ్లిన చాలా మంది తమ స్వగ్రామాలకు చేరుకున్నారు. రంగ వల్లులుతో వాకిళ్లు, పిండి వంటల ఘుమఘుమలే కాకుండా .. డూడూ బసవన్నలు, హరిదాసుల రాకపోకతో పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. అయితే.. సంక్రాంతి పండుగను ఒక్క ప్రాంతంలో ఒకలాగా మరో ప్రాంతంలో మరోలా జరుపుకుంటారు. ప్రధానంగా  హైదరాబాద్ లో ఎక్కువగా పతంగుల పండుగగా జరుపుకుంటారు. ఈ వేడుకలో చిన్నా పెద్ద అని తేడా లేకుండా గాలి పటాలు ఎగుర వేస్తుంటారు. కాగా.. ఇదే సరదా.. పండుగ వేళ ఓ ఇంట్లో విషాదం నింపింది.
 
వివరాల్లోకెళ్తే... జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. దాబాపైన గాలిపటాలు ఎగుర వేస్తూ ఇద్దరూ చిన్నారులు కరెంట్ షాక్ కు గురయ్యారు.  కోరుట్ల పట్టణంలో కల్లూరు రోడ్డు సబ్ స్టేషన్ పక్కన అవధూత గంగారం బంగ్లా పైన సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో తోకల సాత్విక్ (10) ,  పూర్ణం ప్రశాంత్ (12) అనే ఇద్దరు చిన్నారులు కలిసి గాలిపటం ఎగరవేస్తున్నారు.

ఈ క్రమంలో  ప్రమాదశాత్తు ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగలడంతో కరెంటు షాకుకు గురై తీవ్రంగా గాయపడ్డారు. సాత్విక్ అక్కడికక్కడే పడిపోగా ప్రశాంత్ బంగ్లా పైనుంచి కింద పడిపోయాడు. తోకల సాత్విక్ దాదాపు 30 శాతం శరీరం కాలి పోయినట్లు,  పూర్ణం ప్రశాంత్ తలలో రక్తం గడ్డ కట్టి నట్లు ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ తెలిపారు. పోలీసులు దవాఖానకు చేరుకొని వివరాలు తెలుసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios