Asianet News TeluguAsianet News Telugu

విషాదం : తండ్రి అస్థికలు గంగలో కలిపేందుకు వచ్చి.. నీటిలో మునిగి అన్నదమ్ములు మృతి...

అస్తికలు గంగలో కలిపే క్రమంలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో ఉదృతిలో కొట్టుకుపోయారు ఓ అన్నాదమ్ములు.

Two Brothers drowned in water, died in medak - bsb
Author
First Published Nov 18, 2023, 11:36 AM IST

మెదక్ : ఒకే కుటుంబంలో రోజుల తేడాతో ముగ్గురు మృత్యవాతపడిన విషాద ఘటన మెదక్ లో వెలుగు చూసింది. మెదక్ జిల్లాలో ఓ అన్నాదమ్ములు తండ్రి అస్తికలు గంగలో కలపడానికి వచ్చి మృత్యవాత పడ్డారు. కామారెడ్డి జిల్లా రాజం తండా ఇనాంపేటకు చెందిన అన్నదమ్ములు ఇద్దరు తండ్రి అస్తికలు గంగలో కలపడానికి మెదక్ వచ్చారు. అస్తికలు కలిపే క్రమంలో నీటితో దిగారు నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో ఉదృతిలో కొట్టుకుపోయారు. వెంటలే అలర్టైన మిగతావారు పోలీసులకు తెలపడంతో.. వారు వచ్చి ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios