భర్తను చంపిన నాగర్ కర్నూలు స్వాతి కేసులో ట్విస్ట్

First Published 6, Aug 2018, 2:41 PM IST
Twist in Nagarkurnool Swathi case
Highlights

ప్రియుడి కోసం భర్తను చంపిన నాగర్ కర్నూలు స్వాతి కేసు మలుపు తిరిగింది. ఇద్దరు జామీను ఇవ్వడంతో ఆమె ఇటీవల జైలు నుంచి విడుదలైంది.

హైదరాబాద్: ప్రియుడి కోసం భర్తను చంపిన నాగర్ కర్నూలు స్వాతి కేసు మలుపు తిరిగింది. ఇద్దరు జామీను ఇవ్వడంతో ఆమె ఇటీవల జైలు నుంచి విడుదలైంది. అయితే, ఆ ఇద్దరు వ్యక్తులు కూడా తాము ఇచ్చిన జామీనును వెనక్కి తీసుకున్నారు.

బెయిల్ లభించిన స్వాతిని తీసుకుని వెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆమెను స్టేట్ హోమ్ కు తరలించారు. అయితే, తాము ఇచ్చిన జామీనును ఉపసహరించుకోవడంతో ఆమె భవిష్యత్తు మరోసారి అయోమయంలో పడింది.

జైలు నుంచి బయటకు వచ్చిన ఆమె తన పిల్లలతో ఉందామని అనుకుంది. అయితే, అందుకు వీలు లేకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఆమెను స్వీకరించడానికి సిద్ధంగా లేరు. కోర్టులో ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. కేసు విచారణ ఆగస్టు 7వ తేదీకి వాయిదా పడింది. ఆమె తిరిగి జైలుకు వెళ్తుందా, ఏమవుతుందనే తేలే అవకాశాలున్నాయి.  

loader