కవలల హత్య: రెండు నెలల క్రితమే ప్లాన్ వేసిన మేనమామ

Twins murder planned for over two months
Highlights

మానసిక వికలాంగులైన కవలలను చంపడానికి మేనమామ రెండు నెలల క్రితమే ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్: మానసిక వికలాంగులైన కవలలను చంపడానికి మేనమామ రెండు నెలల క్రితమే ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. మల్లికార్జున్ రెడ్డి అనే వ్యక్తి సృజనారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి అనే 12 ఏళ్ల పిల్లలను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. 

మల్లికార్జున్ రెడ్డిని, అతని డ్రైవర్ వివేక్ రెడ్డిని, మిత్రుడు వెంకట్ రెడ్డిని హైదరాబాదులోని చైతన్యపురి పోలీసులు ఆదివారంనాడు అరెస్టు చేశారు. పిల్లల శవాలను తల్లిదండ్రుల వద్దకు తీసుకుని వెళ్తుండగా ఇంటి యజమానికి కనిపెట్టి శనివారంనాడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

పిల్లలను చంపడానికి మల్లికార్జున్ రెడ్డి నెలల క్రితమే ప్రణాళిక రచించినట్లు ఎల్బీ నగర్ ఎసిపి కె. పృథ్వీధర్ రావు చెప్పారు. కొద్ది కాలం పాటు పిల్లలు స్పెషల్ హోంలో ఉన్నారు. దాదాపు 80 వేల రూపాయల ఖర్చవుతుండడంతో పిల్లల సంరక్షణ భారాన్ని కుటుంబం మోసే స్థితిలో లేకుండా పోయిందని అంటున్నారు. 

పిల్లల తల్లి లక్ష్మీరెడ్డి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండడం, తండ్రి శ్రీనివాస రెడ్డి బిజీగా ఉంటుండడంతో కేర్ హోంలో లేని సమయాల్లో పిల్లలు మల్లికార్జున్ వద్దనే ఉండేవారు. 

కెమికల్ ఇంజనీరింగ్ అయిన మల్లికార్జున్ రెడ్డికి ఉద్యోగం లేదని, భార్యతో విడాకులు తీసుకున్నాడని, ఇది కూడా మల్లికార్జున్ రెడ్డిని కలతకు గురి చేసిందని పృథ్వీధర్ రావు చెప్పారు .

మల్లికార్జున్ రెడ్డి శుక్రవారం రాత్రి దిండుతో అదిమి పట్టి పిల్లలను చంపేసిన తర్వాత ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పాడు. ఆ తర్వాత మిర్యాలగుడాలోని తల్లిదండ్రుల వద్దకు శవాలను తీసుకుని వెళ్తుండగా పట్టుబడ్డాడు. 

loader