Asianet News TeluguAsianet News Telugu

మహబూబ్ నగర్ లో దారుణం.. పన్నెండేళ్ల బాలికపై ముగ్గురు యువకుల అత్యాచారం..

ఆరో తరగతి చదువుతున్న పన్నెండేళ్ల  బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక స్కూలుకు వెళ్లడానికి నిరాకరిస్తుండడంతో తల్లి అడగగా విషయం వెలుగులోకి వచ్చింది. 

Twelve-year-old girl was raped by three youths in Mahbub Nagar
Author
Hyderabad, First Published Aug 23, 2022, 12:48 PM IST

మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. నెల్లికుదురు మండలం రత్తిరాంతండా శివారు జాజు తండాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. నెల్లికుదుర్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో బాలిక 6వ తరగతి చదువుతోంది. అయితే, రోజు పాఠశాలకు వెళ్లే బాలిక ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. అది గమనించిన తల్లి బాలికను అడిగితే.. మొదట ఏమీ చెప్పలేదు. 

కానీ గట్టిగా మందలించడంతో.. బాలిక జరిగిన విషయాన్ని తల్లితో చెప్పుకుంది. గట్టిగా ఏడుస్తూ కన్నీటిపర్యంతమయ్యింది. అది విన్న బాలిక తల్లి షాక్ అయ్యింది. వెంటనే ఈ విషయం మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదులతో యువకుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

సింగరేణి కార్మికుడి హత్యకు ఆరుసార్లు ప్రయత్నం.. చివరికి, భార్య ఇంట్లో ఉండగానే....

ఇదిలా ఉండగా, సెంట్రల్ ఢిల్లీలోని యమునా ఖాదర్ అటవీ ప్రాంతంలో ఎనిమిదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, ఆపై ఆమెను హత్య చేసిన కేసులో 36 ఏళ్ల కసాయిని సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి బాలిక గొంతు కోసి, ఆమె ముఖాన్ని ఛిద్రం చేశాడు. నిందితుడు రిజ్వాన్ అలియాస్ బాద్షా బీహార్‌ నివాసి. పని కోసం 20 సంవత్సరాల క్రితం ఢిల్లీకి వచ్చాడు. తుర్క్‌మన్ గేట్ ప్రాంతంలో కసాయిగా పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. మాదకద్రవ్యాలకు బానిస అయిన రిజ్వాన్ వీడ్ తాగడానికి యమునా ఖాదర్ వద్దకు వెళ్లేవాడని వారు తెలిపారు. 

ఈ క్రమంలో దర్యాగంజ్ లో ఉండే ఓ వ్యక్తి భార్యతో అతనికి సంబంధం ఏర్పడింది. ఆమెకు నలుగురు పిల్లలున్నారు. ఆగష్టు 4-5 మధ్య రాత్రి, అతను తన భార్య, నలుగురు పిల్లలతో తన ఇంట్లో పడుకున్నాడు. తెల్లవారుజామున 4 గంటలకు మేలుకువ వచ్చి చూసేసరికి, తన కుమార్తెలలో ఒకరు కనిపించలేదు. దీంతో అంతటా వెతికాడు. ఆమె కోసం పొరుగు వారిని అడిగాడు. అయినా ఆమె ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కాగా, ఆగస్టు 18న యమునా ఖాదర్ ప్రాంతంలో తప్పిపోయిన బాలిక మృతదేహం కనిపించింది. శరీరంపై పదునైన ఆయుధంలో గాయాలు చేసినట్టు కనిపించింది. నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా.. యమునా ఖాదర్ ప్రాంతానికి వెడుతున్న సమయంలో బాధితురాలి  తల్లి జుగ్జీతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. అ క్రమంలో మైనర్ బాలికతో స్నేహం చేశాడు.బాధితురాలు తనను, ఆమె తల్లితో సన్నిహితంగా ఉండడం చూసిందని, అందుకే ఆమెను చంపాలని నిర్ణయించుకున్నానని రిజ్వాన్ వెల్లడించినట్లు డీసీపీ తెలిపారు. ఘటన జరిగిన రోజు కూడా ఆమె పక్కింటికి వెళ్లి వీడ్ తాగినట్లు రిజ్వాన్ తెలిపారు. ఆ తరువాత అక్కడినుంచి వెళ్లిపోకుండా అందరూ పడుకునే వరకు వేచి ఉన్నాడని, బాధిత కుటుంబ సభ్యులందరూ నిద్రపోయాక ఘాతుకానికి పాల్పడ్డాడని డీసీపి తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios