హైదరాబాద్:  తమపై మాజీ సీఈఓ రవిప్రకాష్ చేసిన  ఆరోపణలను టీవీ 9 కొత్త యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. టీవీ9 కొత్త యాజమాన్యంపై రవిప్రకాష్ ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం నాడు ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. 

రవిప్రకాష్ విడుదల చేసిన వీడియోలో  కొత్త యాజమాన్యంపై పలు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై  టీవీ9 కొత్త యాజమాన్యం వివరణ ఇచ్చింది. తప్పుడు కేసులైతే రవిప్రకాష్ ఎందుకు పోలీసులను తప్పించుకొని తిరుగుతున్నాడో చెప్పాలని టీవీ9 యాజమాన్యం ప్రశ్నించింది.

టీవీ9 లోగో తన స్వంతమని రవిప్రకాష్ చెప్పడం సరైంది కాదన్నారు. ఏబీసీఎల్ సంస్థలో మెజారిటీ వాటా లేకున్నా పెత్తనం చెలాయించేందుకు రవిప్రకాష్ ప్రయత్నించాడని టీవీ9 సంస్థ ఆరోపించింది. తప్పు చేయనప్పుడు రవిప్రకాష్ ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడో చెప్పాలని  టీవీ9 ప్రశ్నించింది.

ఏబీసీఎల్‌లో 90 శాతానికి పైగా వాటాను  అలంద మీడియా కొనుగోలు చేసింది. ఈ తరుణంలోనే టీవీ9 కొత్త యాజమాన్యంతో రవిప్రకాష్‌కు గొడవలు చోటు చేసుకొన్నాయి.  టీవీ9 కొత్త యాజమాన్యం రవిప్రకాష్‌పై కేసులు పెట్టింది.

సంబంధిత వార్తలు

తప్పుడు కేసులు: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్

ముందస్తు బెయిల్‌ కోసం రవిప్రకాష్ మరో పిటిషన్