Asianet News TeluguAsianet News Telugu

ఆ చానెళ్లు అలా చేశాయా?

  • తెలుగునాట టాప్ చానెళ్ల రేటింగ్ పై వేటు
  • నాలుగు వారాల రేటింగ్ నిలుపుదల
  • ‘బార్క్’ సంచలన ప్రకటన
tv news channel ratings

 

కొన్ని టివి చానెళ్లు రేటింగ్ లను పెంచుకునేందుకు అక్రమాలకు పాల్పడుతున్నాయని రేటింగ్ ఏజెన్సీ సంస్థ బార్క్ సంచలన ప్రకటన చేసింది. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ చానెళ్లుగా ఉన్న టివి9, వి6 లు రేటింగ్స్ కోసం అక్రమాలకు పాల్పడినట్లు తాము నిర్ధారించామని బార్క్ పేర్కొంది.

 

ఇప్పటి వరకు తెలుగునాట నెంబర్ వన్ హోదాను అనుభవిస్తున్న టివి9, తెలంగాణ లో దూసుకెళ్తున్న వి6ల ను బార్క్ తప్పుపట్టడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.

 

ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో ఇవి టాప్ లోనే ఉంటూ వస్తున్నాయి. అలాంటిది ఈ చానెళ్లే రేటింగ్ ల కోసం అక్రమాలకు పాల్పడ్డాయని స్వయంగా బార్క్ ప్రకటించడం మింగుడుపడని అంశం.

 

ప్రస్తుతం దేశంలో టీవీ ఛానళ్లకు బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా (బార్క్) రేటింగ్స్ ఇస్తోంది. ఈవారం రేటింగ్స్ లో టీవీ9, వీ6 రేటింగ్స్ విడుదల కాలేదు.

ఎందుకు వీటికి రేటింగ్ ఇవ్వలేదో తెలుపుతూ బార్క్ తన వినియోగదారులకు ఒక సందేశం కూడా పంపింది.

 

అందులో ఈ రెండు చానెళ్లు మోసాలకు పాల్పడినట్లు వెల్లడించింది. 4 వారాల పాటు ఈ రెండు ఛానళ్ల రేటింగ్స్ ను నిషేధిస్తున్నట్టు తెలిపింది. ఈ జాబితాలో ఇండియా న్యూస్ కూడా ఉంది. కొంతకాలంగా బార్క్.. తన విశ్వసనీయతను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది.

 

ఇందుకోసం అంతర్గత సర్వేలను నిర్వహిస్తోంది. సమగ్రమైన, నికార్సైన రేటింగ్స్ ఇచ్చేందుకు ట్రై చేస్తోంది.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios