Asianet News TeluguAsianet News Telugu

జర్నలిస్టుల సంక్షేమంలో కెసిఆర్ దేశానికే ఆదర్శం

  • టియుడబ్ల్యు జె నూతన కార్యాలయం ప్రారంభం
  • హాజరైన మంత్రులు హరీష్, లక్ష్మారెడ్డి
  • సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జర్నలిస్టులకు ఇళ్లు
  • తెలంగాణ సర్కారు జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్న యూనియన్
tuwj new office launched

జర్నలిస్టుల సంక్షేమంలో తెలంగాణ సిఎం కెసిఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని మంత్రి హరీష్ రావు కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టులకు వంద కోట్ల నిధి కేటాయించారని తెలిపారు. సుప్రీం కోర్ట్ తీర్పు రాగానే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమాజం కొరకు అహర్నిశలు పాటు పడుతున్న జర్నలిస్టుల సంక్షేమం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందన్నారు.

ఆదర్శనగర్ ఎమ్మెలే క్వాటర్స్ లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ పాల్గొని మాట్లాడారు. హరీష్ తోపాటు వైద్య శాఖ మంత్రి లక్ష్మా రెడ్డి, మీడియా అకాడమీ చెర్మెన్ అల్లం నారాయణ. డిజిపి అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి , వరంగల్ మేయర్ బండ నరేందర్, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం జర్నలిస్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని టియు డబ్ల్యు జె సెక్రటరీ క్రాంతి కిరణ్ అన్నారు. గత ప్రభుత్వాలు మన విజ్ఞప్తులను విస్మరించాయన్నారు. తెలంగాణ ఉద్యమం లో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదన్నారు.

మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెల్త్ కార్డ్ లను మంజూరు చేసిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానిదే అన్నారు. జర్నలిస్ట్ ఫండ్ కింద 60 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన ఘనత ప్రభుత్వానిదేనని కొనియాడారు. 101 మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించినట్లు చెప్పారు. నాన్ అక్రిడేటెడ్ జర్నలిస్టులకు కూడా త్వరలోనే హెల్త్ కార్డుల మంజూరవుతాయన్నారు.

మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ త్వరలోనే జిల్లా కేంద్రాల్లో వెల్ నెస్ సెంటర్ల ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సమాజం లో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios