పాలిటిక్స్ లోకి రావడంపై తుల్జా భవానీరెడ్డి ఆసక్తికర కామెంట్స్... ఏమంటారంటే...
జనగామ ఎమ్మెల్యే కూతురు భవానీరెడ్డి తాను కేసీఆర్ ను కలవకపోవడానికి కారణం ఉందని తెలిపింది. రాజకీయాల్లోకి రావడం విషయంలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.

జనగామ : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు తుల్జా భవానీరెడ్డి తన రాజకీయ రంగ ప్రవేశంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘తనకు రాజకీయాలంటే ఇష్టం లేదని.. ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన లేదు. అందుకే నాన్నతో గొడవ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవలేదు’ అని తెలిపింది.
ఇటీవల జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. తన అధికారిక కార్యక్రమాలను కూతురు తుల్జా భవాని రెడ్డి, అల్లుడు రాహుల్ రెడ్డి అడ్డుకుంటున్నారని హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేశారు.
భారీ వర్షాలు : తెలంగాణలో నేడు, రేపు స్కూళ్లకు సెలవులు.. ముంబై లోనూ ఇదే పరిస్థితి...
బుధవారం నాడు.. ఈ కేసు విచారణ విషయమై రామకృష్ణ అనే తుల్జా భవాని రెడ్డి బంధువును పోలీసులు పిలిపించారు. అతనితోపాటు కూతురు తుల్జా భవాని రెడ్డి, అల్లుడు రాహుల్ రెడ్డి కూడా జనగామ పోలీస్ స్టేషన్ కి వచ్చారు. వారిని పోలీసులు ఎమ్మెల్యే అధికారిక పర్యటనను అడ్డుకున్నారని ఆరోపణల మీద ఆరా తీశారు.
ఈ ఆరోపణలపై రామకృష్ణ నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. దీంతో పాటు తుల్జా భవాని రెడ్డి, రాహుల్ రెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. దీనిమీద తుల్జా భవాని రెడ్డి మాట్లాడుతూ.. తన తండ్రైన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అధికారిక కార్యక్రమాలను తాము ఎప్పుడూ అడ్డుకోలేదని తెలిపింది. వివాదాస్పదంగా మారిన చేర్యాల భూమిని మున్సిపాలిటీకి ఇచ్చిన తర్వాత తన తండ్రి ఆ విషయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారని గుర్తు చేసింది.
కానీ, దీనికి భిన్నంగా ఇప్పుడు కేసులు పెట్టి మళ్ళీ ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ భూమిని తాను కబ్జా చేశానని తన తండ్రి బహిరంగంగా చెప్పాడని.. అయినా కూడా ఆయన పదవిలో ఎందుకు ఉన్నారని, రాజీనామా ఎందుకు చేయడం లేదని సూటిగా ప్రశ్నించింది. తండ్రి కబ్జా చేసిన భూమిని తాను ఇచ్చానని ఈ విషయంలో.. ఆయన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. కన్న కూతురిపై ఓ తండ్రి ఇలా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది.