Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ తెలుగుదేశం పార్టీ మేనిపెస్టోలోని అంశాలివే...

తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్పతిపక్షాలన్ని కలిసి మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇందులో భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం ఇవాళ తమ పార్టీ మేనిపెస్టోను ప్రకటించింది.  ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో టిటిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, దేవేందర్‌గౌడ్‌ లు ఈ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. 

ttdp manifesto release
Author
Hyderabad, First Published Nov 21, 2018, 2:39 PM IST

తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్పతిపక్షాలన్ని కలిసి మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇందులో భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం ఇవాళ తమ పార్టీ మేనిపెస్టోను ప్రకటించింది.  ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో టిటిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, దేవేందర్‌గౌడ్‌ లు ఈ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. 

మేనిపెస్టోలోని ముఖ్యాంశాలు:
 
 తెలంగాణ రాష్ట్ర సాధన కకోసం ప్రాణత్యాగం చేసిన 1200  అమరవీరుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం, ఒక ఇళ్లు, రూ.10 లక్షలు అందజేత

 అమరవీరుల కోసం ప్రత్యేక స్మృతి చిహ్నం, చరిత్రలో వారి పేరు నిలిచిపోయేలా కార్యక్రమాలు

అన్ని జిల్లా కేంద్రాల్లో పూలే, అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు 

ప్రొఫెసర్ జయశంకర్ పేరిట ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు

రవీంద్ర భారతి తరహాలో జిల్లా కేంద్రాల్లో కాళోజి పేరిట సాస్కృతిక వేదికల ఏర్పాటు

దాశరథి రంగాచార్య పేరిట సాంస్కృతిక పురస్కారాలు

ముఖ్యమంత్రి, మంత్రుల నివాసాలు, కార్యాలయాలు శాశ్వత ప్రాతిపదికపై ఏర్పాటు 

ప్రతిఏటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల....దాని ద్వారానే ప్రభుత్వ ఖాళీల వెల్లడి

మొదటి ఏడాదే లక్ష ఉద్యోగాల భర్తీ

నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి

ఇంటర్ నుండి చూనివర్సిటీ స్థాయి విద్యార్థులకు ల్యాప్ టాప్ లు

ప్రగతి భవన్ ప్రజా ఆస్పత్రిగా మార్పు 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌళిన సదుపాయాల ఏర్పాటు కోసమే  వైద్య ఆరోగ్య బడ్జెట్ కు ప్రతియేటా రూ. 5వేల కోట్లు కేటాయింపు

ప్రతి జిల్లా కేంద్రంలో దశలవారిగా ప్రభుత్వ రంగ మెడికల్ కాలేజీ, డెంటల్ కాలేజీ

అన్ని పాత జిల్లాల్లో పశుసంవర్థక కాలేజీల ఏర్పాటు

వికారాబాద్ లో నేచర్ క్యూర్ యూనివర్సిటీ ఏర్పాటు

విభజన హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి

- లోకాయుక్త పరిధిలోకి ప్రజాప్రతినిధులు

మహిళల కోసం ఐలమ్మ సాధికారత కార్యక్రమాలు

ప్రతి డ్వాక్రా సంఘానికి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు

బిసి, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు

బెల్ట్ షాపుల రద్దు

ప్రభుత్వోద్యయోగాల్లో వికలాంగులకు రిజర్వుషన్లు అమలు

వికలాంగులకు ప్రతి నెలా రూ.3వేల పించను

వితంతువులకు ప్రతినెలా రూ.2 వేల పెన్షన్ 

ప్రభుత్వోద్యోగులకు పాత పెన్సన్ విధానం వర్తింపు
  
ప్రభుత్వోద్యోగులకు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణం

జర్నలిస్టులు, లాయర్ల సంక్షేమానికి చర్యలు

చేనేత కార్మికులకు రూ. 5 లక్షలతో పక్కా ఇళ్లు, నేత మగ్గానికి ప్రత్యేక షెడ్

రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, కౌలు రైతులకూ వర్తింపు 

వ్యవసాయ పెట్టుబడి సాయం  కింద రైతులకు ఏడాదికి రూ.10వేలు అందజేత

వ్యవసాయ ధరల కమీషన్ ఏర్పాటు

ఒక్కో వ్యక్తికి 7 కిలోల నాణ్యమైన బియ్యం కేవలం రూ. 1లకే పంపిణీ
 

Follow Us:
Download App:
  • android
  • ios