హైదరాబాద్: ఓల్డ్ మలక్‌పేటలోని 26 డివిజన్ రీ పోలింగ్ నిర్వహించాల్సి ఉన్నందున  ఎగ్జిల్ పోల్స్ పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది.

ఓల్డ్ మలక్‌.పేటలోని 26వ డివిజన్ లో సీపీఐ అభ్యర్ధి ఫాతిమా ఎన్నికల గుర్తు కంకి కొడవలికి  బదులుగా సీపీఎం ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తును బ్యాలెట్ పేపర్ పై ముద్రించారు. ఈ విషయాన్ని గుర్తించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  రాష్ట్ర ఎన్నికల సంఘానికి  ఫిర్యాదు చేశారు. దీంతో ఈ డివిజన్ లోని 69 పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ను రద్దు చేశారు. 

also read:ఓల్డ్ మలక్‌పేట 26వ డివిజన్‌లో పోలింగ్ రద్దు: డిసెంబర్ 3న రీ పోలింగ్

ఈ నెల 3వ తేదీన రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది. ఎల్లుండి రీ పోలింగ్  ఉన్న నేపథ్యంలో  ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధిస్తున్నట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది.

సాధారణంగా పోలింగ్ పూర్తైన తర్వాత  ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించేందుకు ఎన్నికల సంఘం అనుమతిని ఇవ్వనుంది. అయితే రీ పోలింగ్ దృష్ట్యా ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించారు.